అమేథీలో నువ్వా-నేనా : మరోసారి రాహుల్ ని ఢీ కొట్టనున్న స్మృతీ ఇరానీ

  • Published By: venkaiahnaidu ,Published On : March 21, 2019 / 04:14 PM IST
అమేథీలో నువ్వా-నేనా : మరోసారి రాహుల్ ని ఢీ కొట్టనున్న స్మృతీ ఇరానీ

Updated On : March 21, 2019 / 4:14 PM IST

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై మరోసారి పోటీకి కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ రెడీ అయ్యారు.యూపీలోని అమేథీ లోక్ సభ స్థానం నుంచి మరోసారి ఈ ఇద్దరు తలపడనున్నారు.2014 ఎన్నికల్లో కూడా అమేధీలో రాహుల్ పై స్మృతి పోటీచేశారు.అయితే దశాబ్దాలుగా కాంగ్రెస్ కు కంటుకోటగా ఉన్న అమేథీలో స్మృతీపై రాహుల్ విజయం సాధించారు.అయితే రాహుల్ మెజార్టీని మాత్రం ఆమె తగ్గించగలిగారు.184లోక్ సభ స్థానాలకు గురువారం(మార్చి-21,2019) బీజేపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.

ఈ సారి అమేథీలో ఎలాగైనా రాహుల్ ని ఓడించాలన్న పట్టుదలతో బీజేపీ ఉంది.ఇటీవల ప్రధాని మోడీ కూడా అమేథీలో పర్యటించారు.అమేథీలో తాము గెలవకపోయినా అక్కడి ప్రజల హృదయాలను గెల్చకున్నామని అన్నారు.కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్మృతీ ఇరానీ కూడా అమేథీపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది.ఈ ఎన్నికల్లో అమేథీలో విజయం ఎవరిదో తెలియాలంటే మాత్రం మే-23,2019 వరకు వేచి చూడాల్సిందే.