చౌకీదార్ కి బీజేపీ ఎంపీ రాజీనామా లేఖ
యూపీలో అధికార బీజేపీకి మరో షాక్ తగిలింది.ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు పార్టీని వీడారు.ఇప్పుడు మరో ఎంపీ ఆ జాబితాలో చేరారు.

యూపీలో అధికార బీజేపీకి మరో షాక్ తగిలింది.ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు పార్టీని వీడారు.ఇప్పుడు మరో ఎంపీ ఆ జాబితాలో చేరారు.
యూపీలో అధికార బీజేపీకి మరో షాక్ తగిలింది.ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు పార్టీని వీడారు.ఇప్పుడు మరో ఎంపీ ఆ జాబితాలో చేరారు. అంతేకాకుండా తన రాజీనామా లేఖను బీజేపీ ఆఫీస్ సెక్యూరిటీ గార్డ్(చౌకీదార్)కి ఎంపీ అందజేశారు.మైన్ భీ చౌకీదార్ అంటూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున బీజేపీ క్యాంపెయిన్ చేస్తున్న సమయంలో చౌకీదార్ చేతిలో ఎంపీ తన రాజీనామా లేఖ పెట్టి వెళ్లిపోయి సమాజ్ వాదీ పార్టీలో చేరడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Read Also : విధుల్లో ఉన్న వారికి ఓటు వేసే ఛాన్స్ : ఈసీ రజత్ కుమార్
2014సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని హర్దోయ్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన అన్షుల్ వర్మ ఈ ఎన్నికల్లో తనకు సీటు కేటాయించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.తన స్థానంలో జై ప్రకాష్ రావత్ ని హర్దోయ్ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించండపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ బుధవారం (మార్చి-27,2019) బీజేపీ ప్రాధమిక సభ్యత్వానికి అన్షుల్ వర్మ రాజీనామా చేశారు.లక్నో లోని బీజేపీ ఆఫీస్ దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్(చౌకీదార్)కి ఆయన తన రాజీనామా లేఖను ఇచ్చి వెళ్లిపోయారు.ఈ పరిణామంతో బీజేపీ నాయకులు షాక్ అయ్యారు.
2014లో ఔట్ సైడర్ అనే ముద్ర పడినప్పటికీ తన సొంత కృషితో హర్దోయ్ నుంచి విజయం సాధించానని అన్షుల్ తెలిపారు. తాను అభివృద్ధి కోసం పనిచేశానని,తాను అన్షుల్ గానే ఉంటానని,తాను చౌకీదార్ గా ఎప్పటికీ మారనని.. ట్విట్టర్ లో ప్రధాని ప్రారంభించిన చౌకీదార్ ఉద్యమంపై ఈ సందర్భంగా అన్షుల్ సెటైర్లు వేశారు. ఈ రోజుల్లో అత్యంత బాధ్యతాయుతంగా ప్రవర్తించే వ్యక్తి చౌకీదారే అని, ఈ కారణంతోనే చౌకీదార్ గా నటించే వ్యక్తుల కన్నా నిజమైన చౌకీదార్ కి ఎందుకు రాజీనామా లేఖ ఇవ్వకూడదని అనుకొని తన రాజీనామా లేఖను నిజమైన చౌకీదార్ కు అందించానని అన్షుల్ తెలిపారు. ఇప్పటికే హర్దోయ్ సీటుకి వేరొక వ్యక్తి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది.దీంతో అన్షుల్ ని మరో స్థానం నుంచి పోటీకి దించాలని ఎస్పీ భావిస్తుంది.
Read Also : నవాజ్ షరీఫ్ కు బెయిల్