Antony Blinken : భారత పర్యటనకు అమెరికా విదేశాంగ మంత్రి
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని జె బ్లింకెన్ రెండు రోజుల భారత పర్యటనకు రానున్నారు.

Blinken
Antony Blinken అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని జె బ్లింకెన్ రెండు రోజుల భారత పర్యటనకు రానున్నారు. మంగళవారం(జులై-27,2021)నుంచి బ్లింకన్.. రెండు రోజుల భారత పర్యటన ప్రారంభమవుతుంది. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆ దేశానికి చెందిన విదేశాంగ మంత్రి భారత పర్యటనకు రానుండటం ఇదే మొదటిసారి.
ఈ పర్యటనలో ఆంటోని బ్లింకెన్.. ప్రధాని నరేంద్రమోదీతోపాటు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్,జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో భేటీ కానున్నట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. భారతదేశంలో మానవ హక్కులు, పెగసాస్ గూఢచర్యం,కరోనా నివారణ చర్యలు, ఇండో- పసిఫిక్ ప్రాంతీయ అంశాలు, అఫ్ఘానిస్థాన్‌లో తాజా పరిస్థితి,ఉగ్రవాద నిధుల విషయంలో పాకిస్తాపై ఒత్తిడి కొనసాగించాల్సిన అవసరం వంటి విషయాలను బ్లింకెన్ తన భారత పర్యటనలో లేవనెత్తే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
బ్లింకెన్ పర్యటన.. ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సంభాషణను కొనసాగించడానికి మరియు భారత్-యూఎస్ ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచడానికి ఒక అవకాశమని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇరుపక్షాలు బలమైన మరియు బహుముఖ భారత్-యూఎస్ ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షిస్తాయి మరియు వాటిని మరింత సంఘటితం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని ప్రకటనలో పేర్కొంది. US Secretary Of State Blinken Arrives In India On Tuesday