Mary Millben: మణిపుర్‌పై మోదీకి అమెరికా గాయని మేరి మిల్‌బెన్ మద్ధతు
అమెరికా గాయని మేరీ మిల్‌బెన్ మణిపుర్ సమస్యపై ప్రధాని నరేంద్ర మోదీకి మద్ధతు తెలిపారు. తన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి ప్రతిస్పందనగా గురువారం పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రసంగం ముగిసిన కొద్దిసేపటికే అమెరికా గాయని మేరీ మిల్‌బెన్ వ్యాఖ్యలు వెలువడ్డాయి....

US singer supports Modi
US singer Mary Millben : అమెరికా గాయని మేరీ మిల్‌బెన్ మణిపుర్ సమస్యపై ప్రధాని నరేంద్ర మోదీకి మద్ధతు తెలిపారు. తన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి ప్రతిస్పందనగా గురువారం పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రసంగం ముగిసిన కొద్దిసేపటికే అమెరికా గాయని మేరీ మిల్‌బెన్ వ్యాఖ్యలు వెలువడ్డాయి. (US singer supports PM Modi) మణిపుర్ తల్లులు, కుమార్తెలు, మహిళలకు మోదీ న్యాయం చేస్తారనే విశ్వాసం తనకు ఉందని మిల్ బెన్ ట్వీట్ చేశారు. (Manipur issue)
No Confidence Motion: అవిశ్వాస తీర్మానంపై విపక్షాలకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన ప్రధాని మోదీ
‘‘స్వాతంత్ర్య భారతావనిలో సత్యాన్ని తెలియజేయండి నాకు మోదీపై విశ్వాసం ఉంది. ఆయన కోసం నేను ప్రార్థిస్తున్నాను’’ అని అమెరికా గాయని పేర్కొన్నారు. (India has confidence in its leader) అమెరికాలో ప్రముఖ గాయని అయిన మిల్ బెన్ ఈ ఏడాది జూన్ నెలలో మోదీ అమెరికా పర్యటన సందర్భంగా మన దేశ జాతీయ గీతం జనగణ మన పాడిన తర్వాత మోదీని కలిసి ఆయనకు పాదాభివందనం చేశారు. కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై స్పందించిన ప్రధాని మోదీ పార్లమెంట్‌లో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. మణిపుర్‌లో హింసను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
Also Read: ఆవులు, గేదెల్ని కూడా లెక్కిస్తారు, మా లెక్కలు ఒద్దా? ఆర్ఎస్ఎస్ పేరు ప్రస్తావిస్తూ జేడీయూ నేత ఫైర్