JD Vance: భారత్‌కు చేరుకున్న జేడీ వాన్స్.. భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి ఢిల్లీలో ల్యాండ్.. వారు పర్యటించే ప్రాంతాలివే..

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన భార్య ముగ్గురు పిల్లలతో కలిసి భారత్ కు చేరుకున్నారు.

JD Vance: భారత్‌కు చేరుకున్న జేడీ వాన్స్.. భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి ఢిల్లీలో ల్యాండ్.. వారు పర్యటించే ప్రాంతాలివే..

US Vice President JD Vance

Updated On : April 21, 2025 / 10:54 AM IST

JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ కు చేరుకున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీలోని పాలెం టెక్నికల్ ఎయిర్ పోర్టులో దిగారు. ఆయన వెంట సతీమణి ఉషా వాన్స్ చిలుకూరి, వారి ముగ్గురు పిల్లలు. ఉన్నతస్థాయి అమెరికా ప్రతినిధులు ఉన్నారు. జేడీ వాన్స్, ఉషావాన్స్, ముగ్గురు పిల్లలు భారతీయ  సాంప్రదాయ దుస్తులు ధరించి ఢిల్లీలో అడుగు పెట్టారు. విమానాశ్రయంలో వారికి భారతీయ సాంప్రదాయ నృత్యాలతో కళాకారులు ఘనంగా స్వాగతం పలికారు. జేడీ వాన్స్ ఫ్యామిలీ నాలుగు రోజులపాటు ఇండియాలో పర్యటించనుంది. ఈ క్రమంలో వారు ఇవాళ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. అనంతరం భారతదేశంలోని పలు ప్రముఖ ప్రదేశాలను వారు సందర్శించనున్నారు.

 

జెడి వాన్స్ తన భార్య ఉషా వాన్స్, పిల్లలతో కలిసి నాలుగు రోజులు భారతదేశంలో పర్యటించనున్నారు. తొలుత అక్షరధామ్ ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు వాన్స్ దంపతులకు లోక్ కల్యాణ్ మార్గ్ లోని తన నివాసంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలుకుతారు. అనంతరం ఇరువురు నేతలు అధికారిక చర్చల్లో పాల్గొంటారు. అనంతరం వాన్స్ దంపతులు, అమెరికా అధికారులకు ప్రధాని మోదీ ప్రత్యేక విందు ఇవ్వనున్నారు.

 

ప్రధాని మోదీ ఇచ్చే విందు అనంతరం సోమవారం రాత్రి వాన్స్ ఫ్యామిలీ జయపురకు వెళ్తారు. అక్కడ విలాసవంతమైన రాంభాగ్ ప్యాలెస్ హోటల్ లో బస చేస్తారు.  మంగళవారం ఉదయం అంబర్ కోటతోపాటు పలు చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు. మధ్యాహ్నం రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్ లో వాన్స్ ప్రసంగిస్తారు. అనంతరం స్థానికంగా పలు పర్యటక ప్రాంతాలను వారు సందర్శిస్తారు. బుధవారం వాన్స్ ఫ్యామిలీ ఆగ్రాకు వెళ్లనుంది. అక్కడ తాజ్ మహల్ ను, భారతీయ కళలకు సంబంధించిన శిల్పాగ్రామ్ ను సందర్శిస్తారు. అదేరోజు సాయంత్రం మళ్లీ వారు జయపురకు వెళ్తారు. గురువారం జయపుర నుంచి బయలుదేరి వాన్స్ ఫ్యామిలీ అమెరికాకు బయలుదేరి వెళ్తారు.