JD Vance: జేడీ వాన్స్-ఉషా చిలుకూరి భారత్ పర్యటన ఖరారు.. మోదీతో భేటీతోపాటు వాన్స్ ఫ్యామిలీ ఏయే ప్రాంతాలను సందర్శిస్తారంటే..

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి, తెలుగమ్మాయి ఉషా చిలుకూరి వాన్స్ భారత్ పర్యటనకు వస్తున్నారు.

JD Vance: జేడీ వాన్స్-ఉషా చిలుకూరి భారత్ పర్యటన ఖరారు.. మోదీతో భేటీతోపాటు వాన్స్ ఫ్యామిలీ ఏయే ప్రాంతాలను సందర్శిస్తారంటే..

JD Vance Family

Updated On : April 17, 2025 / 12:33 PM IST

US Vice President JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి, తెలుగమ్మాయి ఉషా చిలుకూరి వాన్స్ భారత్ పర్యటనకు వస్తున్నారు. వచ్చేవారం వీరు భారత్ లో పర్యటించేందుకు షెడ్యూల్ ఖారారైంది. ఉన్నత స్థాయి అధికారుల బృందంతో జేడీ వాన్స్ ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు భారత్ లో పర్యటిస్తారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

Also Read: Gold Rate: నీ దూకుడు.. ఆగేదెప్పుడు..! బాబోయ్ బంగారం ఇక కొనలేమా..? ఇవాళ్టి ధరలు చూస్తే ఖంగుతినాల్సిందే..

జేడీ వాన్స్, భారత సంతతికి చెందిన ఉషా వాన్స్ వారి పిల్లలతో కలిసి భారతదేశానికి వస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏప్రిల్ 21వ తేదీన భారతదేశంలో వారి అధికారిక పర్యటన ప్రారంభమవుతుందని, పర్యటన సమయంలో తొలిరోజే కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని జేడీ వాన్స్ కలుస్తారని పేర్కొంది.

 

డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం టారిఫ్ ల మోతమోగించడం ద్వారా ప్రపంచ వాణిజ్య యుద్ధానికి తెరతీసిన నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ పర్యటనకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పర్యటనలో ఆర్థిక, భౌగోళిక రాజకీయ అంశాలను ప్రధాని మోదీతో వాన్స్ చర్చించనున్నారని ఢిల్లీలోని అమెరికా ఎంబసీ తెలిపింది. అమెరికా, భారత్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉందని తెలిపింది.

 

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అమెరికా సకెండ్ లేడీ ఉషా చిలుకూరి తమ పిల్లలు ఇవాన్, వివేక్, మిరాబెల్ లతో కలిసి జైపూర్, ఆగ్రాలోని ప్రముఖ ప్రాంతాలను సందర్శించనున్నారని ఆయన కార్యాలయం తెలిపింది. ఢిల్లీలోని ఎర్రకోటను వాన్స్ ఫ్యామిలీ సందర్శించనుంది. అదేవిధంగా జైపూర్ లో జరిగే ఓ వివాహ వేడుకకు హాజరవుతారని, ఆ ప్రాంతంలో పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారని పేర్కొంది. తాజ్ మహల్ ను చూసేందుకు ఆగ్రాకు కూడా వెళ్తారని సంబంధిత వర్గాలు తెలిపారు. జేడీ వాన్స్ భారత్ పర్యటన పూర్తిగా ప్రైవేట్ వ్యవహారంగా తెలుస్తోంది. అయినప్పటికీ.. ప్రధాని మోదీని కలిసి ఇరు దేశాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. ఉష చిలుకూరి తెలుగమ్మాయి అని తెలిసిందే. ఈమె తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు.

Also Read: PM Modi: అమరావతిలో ప్రధాని మోదీ పర్యటనకు షెడ్యూల్ ఖరారు.. పనులు పున: ప్రారంభం.. భారీ బహిరంగ సభ..