టూమచ్: ట్రాన్సఫర్ లిస్ట్‌లో చనిపోయిన పోలీసు పేరు

ఉత్తర్‌ ప్రదేశ్‌ లో పోలీసు బదిలీల జాబితాలో మృతి చెందిన పోలీసు అధికారి పేరు వచ్చింది.

  • Published By: veegamteam ,Published On : January 13, 2019 / 03:02 AM IST
టూమచ్: ట్రాన్సఫర్ లిస్ట్‌లో చనిపోయిన పోలీసు పేరు

ఉత్తర్‌ ప్రదేశ్‌ లో పోలీసు బదిలీల జాబితాలో మృతి చెందిన పోలీసు అధికారి పేరు వచ్చింది.

లక్నో : అధికారుల తప్పిందం, నిర్లక్ష్యం వల్ల ఓటర్ లిస్టు, జనాభా లిస్టులో మృతి చెందిన వారి పేర్లు ఉంటున్నాయి. ఉత్తర్‌ ప్రదేశ్‌ లో పోలీసు బదిలీల జాబితాలో మృతి చెందిన పోలీసు అధికారి పేరు వచ్చింది. ఆయన పేరు బదిలీల జాబితాలో రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఉత్తర్‌ ప్రదేశ్‌ లో పోలీసు శాఖ బదిలీలు చేపట్టింది. కొంత మంది పోలీసు ఉన్నతాధికారులను వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేస్తూ పోలీసు శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీల జాబితాలో చనిపోయిన సత్య నరేన్‌ సింగ్‌ పేరు రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. సత్య నరేన్‌ సింగ్‌ అనే డీఎస్పీ స్థాయి అధికారి గత నెలలో చనిపోయాడు. దీనిపై స్పందించిన ఉత్తర్‌ ప్రదేశ్‌ డీజీపీ ఓపీ సింగ్‌.. జరిగిన తప్పుకు క్షమాపణలు తెలిపారు. ఇంత పెద్ద తప్పునకు బాధ్యులైన వారిపై కఠిన చర్య తీసుకుంటామని ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

‘‘తాజాగా విడుదలైన డీఎస్పీల బదిలీల జాబితాలో ఇటీవలే చనిపోయిన సత్య నరేన్‌ సింగ్‌ పేరు కూడా ఉంది. ఒక విభాగాధిపతిగా ఇంత పెద్ద తప్పిదానికి బాధ్యత వహించి క్షమాపణ తెలుపుతున్నాను. సరిచేసుకోలేని ఈ తప్పుకు పాల్పడిన వారిపై నేను కఠిన చర్యలు తీసుకుంటాను. భవిష్యత్తులో ఇలా జరుగకుండా జాగ్రత్త వహిస్తాను.’’ అని ట్వీట్‌ చేశారు.