ప్రేమగా లస్సీ ఇచ్చింది.. తెల్లారేసరికి నగలు తీసుకొని ప్రియుడితో జంప్.. పెళ్లి జరిగి 50రోజులే. సీసీటీవీ దృశ్యాల్లో మాత్రం..
పెండ్లి జరిగిన 50రోజుల తరువాత భర్తను వదిలేసి మహిళ ప్రియుడితో వెళ్లిపోయింది. ఈ ఘటన యూపీలో జరిగింది.

Uttar Pradesh
Uttar Pradesh: పెళ్లి జరిగి 50రోజులు అవుతుంది.. భర్త, అతని కుటుంబ సభ్యుల వద్ద నమ్మకంగా మెలిగింది. అంతా సజావుగా సాగుతున్న సమయంలో ఓ రోజు రాత్రి భర్త, ఇంట్లోని కుటుంబ సభ్యులకు ప్రేమగా లస్సీని అందించింది. వారంతా లస్సీ తాగి స్పృహతప్పి పడిపోయారు. దీంతో ఇంట్లోఉన్న లక్షల విలువైన నగలను తీసుకొని ప్రియుడితో కలిసి పరారైంది. తెల్లారి లేచిచూసే సరికి భార్య కనిపించక పోవటంతో భర్త, అతని కుటుంబ సభ్యులు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో వెతికారు. సీసీటీవీ పుటేజీలు చూసి ప్రియుడితో జంప్ అయిందని తెలుసుకొని ఖంగుతిన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: Walking After Eating: తిన్నవెంటనే కూర్చుంటున్నారా.. ఈ చిన్న సమస్య ప్రాణాంతకం కావచ్చు జాగ్రత్త.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హాపూర్ జిల్లాలోని సిటీ కొత్వాలి ప్రాంతంలోని సారవా గ్రామంలో ఈ ఘటన జరిగింది. సారావా గ్రామంకు చెందిన సల్మాన్ వడ్రంగిగా పనిచేస్తున్నాడు. ఏప్రిల్ 25న లోనీ నివాసి అయిన సనా అనే యువతిని పెళ్లిచేసుకున్నాడు. పెళ్లి జరిగి 50రోజులు అవుతుంది. ఈ క్రమంలో భర్త, అతని కుటుంబ సభ్యులతో సనా నమ్మకంగా మెలిగింది. సనా ప్రవర్తన చూసి ఆమె అత్తమామలు సంతోషపడ్డారు. అసలు విషయం ఇక్కడే మొదలైంది.. సనాకు పెళ్లికి ముందే ప్రేమికుడు ఉన్నాడు.. పెళ్లి తరువాత కూడా అప్పుడప్పుడూ ఫోన్లో మాట్లాడేవాడు. ఈ క్రమంలో ఇద్దరం కలిసి ఎటైనా వెళ్లిపోదామని నిర్ణయించుకున్నారు. దీంతో పక్కా ప్లాన్ వేశారు.
మే 13వ తేదీ రాత్రి సనా ఇంట్లోని సభ్యులందరికీ పెరుగు లస్సీని ప్రేమగా వడ్డించింది. అది తీసుకున్న తరువాత కుటుంబ సభ్యులందరూ స్పృహతప్పి పడిపోయారు. ఆ తరువాత ఇంట్లోఉన్న లక్షల విలువైన నగలు తీసుకొని సనా తన ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. ఉదయాన్నే లేచిన సల్మాన్ భార్య కనిపించక పోవటంతో ఇంట్లో, చుట్టుపక్కల ప్రదేశాల్లో వెతికాడు. ఆమె కనిపించక పోవటంతో కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో వారంతా సనా కోసం వెతికినప్పటికీ ఆమె ఆచూకీ దొరకలేదు. ఇంట్లో ఉన్న రూ.50వేల నగదు, లక్షల విలువైన నగలు కూడా కనిపించకుండా పోవటంతో ఆమె వాటితో వెళ్లిపోయిందని భావించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ క్రమంలో సీసీటీవీ పుటేజీలను తనిఖీ చేశారు. అందులో రాత్రి 12.30 గంటల ప్రాంతంలో సనా ఓ యువకుడితో బైక్ పై వెళ్తున్నట్లు గుర్తించారు. భర్త, అతని కుటుంబ సభ్యులకు అసలు విషయం అప్పుడు అర్ధమైంది. రాత్రి లస్సీలో మత్తుమందు కలిపి ఇచ్చి ప్రియుడితో వెళ్లిపోయిందని తెలుసుకున్నారు. ఈ విషయంపై సనా కుటుంబ సభ్యులను ప్రశ్నించగా.. వారి నుంచి ఎలాంటి సమాచారం రాలేదు.
పోలీసులు దర్యాప్తు చేయగా.. సనా ఘజియాబాద్ నివాసి. ఆమెకు పెళ్లికిముందే హాపూర్‌లోని సింభావాలివెట్ గ్రామానికి చెందిన సోహైల్‌తో సంబంధం ఉంది. అతను ఘజియాబాద్ పరిధి లోనీ ప్రాంతంలో ఏసీ రిపేరర్ గా పనిచేస్తున్నాడు. పోలీసులు సనా, ఆమె ప్రియుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో ఆమెకు కౌన్సిలింగ్ ఇవ్వగా.. తన ప్రేమికుడు సోహైల్‌తోనే కలిసి ఉంటానని సనా తేల్చిచెప్పింది. భర్త సల్మాన్‌తో వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో పోలీసులు సనాను ఆమె బంధువులకు అప్పగించారు.