Uttarkashi Tunnel Collapse Updates : ఉత్తరకాశీ టన్నెల్‌లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌ పనులు .. రంగంలోకి రోబోలు

టన్నెల్ లో చిక్కుకున్న కార్మికుల మానసిక పరిస్థితిని పరిశీలించేందుకు స్వదేశీ రోబోలనుసైతం అధికారులు రంగంలోకి దింపనున్నారు. ఈ రోబోలు కార్మికుల ఆరోగ్య పర్యవేక్షణతో పాటు

Uttarkashi Tunnel Collapse Updates : ఉత్తరకాశీ టన్నెల్‌లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌ పనులు .. రంగంలోకి రోబోలు

Uttarakhand tunnel

Updated On : November 28, 2023 / 7:58 AM IST

Uttarkashi Tunnel: ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మంగళవారం నాటికి 17వ రోజుకు రెస్క్యూ ఆపరేషన్ పనులు చేరుకున్నాయి. కార్మికులను రక్షించేందుకు కొండ పైభాగం నుంచి 86 మీటర్ల డ్రిల్లింగ్ పనులు కొనసాగుతున్నాయి. అయితే, సోమవారం రాత్రి వరకు 36మీటర్లు వర్టికల్‌ డ్రిల్లింగ్‌ చేపట్టిన అధికారులు.. మూడు రోజుల్లోనే పనులు పూర్తయ్యే అవకాశముందని ప్రకటించారు. కూలీలను బయటకు తెచ్చేందుకు 1.20 మీటర్ల వెడల్పు కలిగిన గొట్టాలను వీటి ద్వారా పంపిస్తున్నారు. మరోవైపు సొరంగం లోపల ఇరుక్కుపోయిన ఆగర్‌ యంత్రం బ్లేడ్స్‌ను తొలగించిన సిబ్బంది.. మాన్యువల్‌ డ్రిల్లింగ్‌ కోసం ప్రత్యేకంగా ఆరుగురు నిపుణులను పిలిపించారు. ఇక టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు రోబోటిక్‌ పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగిస్తున్నారు.

Also Read : Uttarkashi tunnel rescue : చివరి దశకు చేరుకున్న ఉత్తరకాశి టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌.. బయటకు రానున్న 41 మంది కార్మికులు

41మంది కార్మికులను క్షేమంగా బయటకు తీసుకువచ్చేందుకు అధికారులు రెండు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. టన్నెల్‌ పైభాగం నుంచి మాన్యువల్ డ్రిల్లింగ్ ప్రారంభించారు. 36 మీటర్లకు పైగా డ్రిల్లింగ్‌ పూర్తయ్యింది. అయితే ఒక మెషీన్‌కు 40 నుంచి 45 మీటర్లు మాత్రమే డ్రిల్లింగ్‌ చేసే సామర్థ్యం ఉన్న నేపథ్యంలో మరో రెండు యంత్రాలను కూడా తీసుకువచ్చారు. వీటినిమార్చి తవ్వకాలు చేపట్టాల్సి రావడంతో ఈనెల 30నాటికి పనులు పూర్తయ్యే అవకాశమున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు.. సొరంగం లోపలి భాగంలో ఇరుక్కుపోయిన ఆగర్‌ మెషీన్‌ ప్లేట్స్‌ను హైదరాబాద్‌ నుంచి తీసుకెళ్లిన ప్లాస్మా కట్టర్‌తో పూర్తిగా తొలగించారు. ఆర్మీకి చెందిన మద్రాస్‌ ఇంజినీరింగ్‌ గ్రూప్‌నకు చెందిన నిపుణుల బృందం ఆధ్వర్యంలో మాన్యువల్‌ డ్రిల్లింగ్‌ పనులు చేపడుతున్నారు. ర్యాట్‌ హోల్‌ టెక్నిక్‌ ద్వారా ఈ పనులు చేపట్టేందుకు ఢిల్లీతోపాటు యూపీలోని ఝాన్సీ నుంచి ఆరుగురు నిపుణులను పిలిపించారు.

Also Read : Uttarkashi Tunnel : ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులు సురక్షితం.. దృశ్యాలు విడుదల

సోమవారం టన్నెల్‌ రెస్క్యూ పనులను పీఎంవో ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రమోద్‌కుమార్‌ మిశ్రా తన బృందంతో కలిసి పరిశీలించారు. టన్నెల్‌ లోపలి భాగంతో పాటు వర్టికల్‌గా జరుగుతున్న డ్రిల్లింగ్‌పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టన్నెల్‌లో చిక్కుకున్న వారితో మిశ్రా వాకీటాకీలో మాట్లాడి వారికి ధైర్యం కల్పించారు. ఇదిలాఉంటే.. టన్నెల్ లో చిక్కుకున్న కార్మికుల మానసిక పరిస్థితిని పరిశీలించేందుకు స్వదేశీ రోబోలనుసైతం అధికారులు రంగంలోకి దింపనున్నారు. ఈ రోబోలు కార్మికుల ఆరోగ్య పర్యవేక్షణతో పాటు ఇంటర్నెట్ సేవలను అందిస్తాయి. సొరంగంలో మీథేన్ లాంటి హానికర వాయువులు ఉన్నాయో లేదో తనిఖీ చేస్తాయి. వీలైనంత త్వరగా వ్యవస్థను సిద్ధంచేసి పనులను ప్రారంభిస్తామని రాబోటిక్ నిపుణుడు మిలింద్ రాజ్ తెలిపారు. ఈ రోబోటిక్ సిస్టమ్ లో మూడు విషయాలు ఉన్నాయి. గ్యాస్ డిటెక్షన్ సిస్టమ్ ఉంది. ఇది కాకుండా ఇంటర్నెట్ సేవలను అందిస్తుంది. కార్మికుల ఆరోగ్యాన్ని దాని స్థానం నుంచి 100 మీటర్ల దూరం నుండి పర్యవేక్షిస్తుందని రాబోటిక్ నిపుణుడు చెప్పాడు.

ఇదిలాఉంటే.. మైక్రో టన్నెల్ నిఫుణుడు క్రిస్ కూపర్ మాట్లాడుతూ.. రాత్రి పనులు చాలా వేగంగా జరిగాయి. 50 మీటర్లు దాటమన్నారు. రాత్రిమాకు ఎలాంటి అడ్డంకులు లేవు. చాలా అనుకూలంగా ఉందని తెలిపారు.