Vaccination Children : నేటి నుంచి చిన్నారుల టీకా రిజిస్ట్రేషన్..ఎల్లుండి నుంచి వ్యాక్సినేషన్
భారత్‌లో పిల్లలకు సంబంధించి ఇప్పటివరకు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్, జైడస్ కాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్-డి వ్యాక్సిన్లకు డీసీజీఐ అత్యవసర వినియోగానికి అనుమతించింది.

Children
Vaccination registration of children : ఎల్లుండి నుంచి దేశంలో 15 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న వారికి వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. దీంతో టీకాలు వేయించుకోవడానికి చిన్నారులు ఇవాళ్టి నుంచి కొవిన్ యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఆధార్ కార్డు లేని పిల్లలు విద్యాసంస్థల ఐడీ కార్డులను ఉపయోగించి కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని కేంద్రం పేర్కొంది.
భారత్‌లో పిల్లలకు సంబంధించి ఇప్పటివరకు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్, జైడస్ కాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్-డి వ్యాక్సిన్లకు డీసీజీఐ అత్యవసర వినియోగానికి అనుమతించింది. కోవాగ్జిన్ టీకాను 12 నుంచి 18 ఏళ్లలోపు ఇచ్చేందుకు అనుమతి లభించింది. ఇక, జైకోవ్-డి వ్యాక్సిన్ విషయానికి వస్తే మూడు డోసుల్లో దీనిని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ టీకాలో సిరంజిలు ఉపయోగించరు.
దేశంలో 15 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు జనవరి 3 నుంచి టీకాలు వేయడం ప్రారంభిస్తామని ఇదివరకే ప్రధాని తెలిపారు. హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు కూడా వ్యాక్సిన్ ప్రికాషస్ డోస్ ఇస్తామని చెప్పారు. జనవరి 10 నుంచి ఇది ప్రారంభం కానుంది.