మన జవాన్లు కొదమ సింహాలు: అమరులకు పెళ్లిజంట నివాళి

వడోదర : పుల్వామా దాడిపై దేశ వ్యాప్తంగా అమర జవానులకు ఘన నివాళులర్పిస్తున్నారు. మన సైనికులను కొదమ సింహాలతో పోలుస్తు..జవాన్లకు నివాళిలర్పించింది ఓ జంట ‘‘ఎవరు చెప్పారు దేశంలో 1,427 సింహాలు మాత్రమే ఉన్నాయని? దేశాన్ని రక్షించేందుకు సరిహద్దులో లక్షలాది సింహాలున్నాయి’’ అని రాసిన ప్లకార్డులతో పెళ్లికి ముందుకు ఊరేగింపు ద్వారా నూతన వధూవరులు నివాళులర్పించారు. ఈ ఊరేగింపులు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని అమరులకు నివాళులర్పించారు.
గుజరాత్ కు చెందిన వజ్రాల వ్యాపారి దేవాషి మానెక్ తన కుమార్తె పెళ్లి విందును రద్దు చేసి 11 లక్షల రూపాయలను అమర జవానుల కుటుంబాలకు అందజేశారు. మరో రూ.5లక్షలను సేవా సంస్థలకు విరాళంగా ఇచ్చారు. అలాగే ఓ సాధారణ ఆటోవాలా కూడా జవాన్లకు తన ఆటో సేవ ద్వారా నివాళులర్పించాడు. 30 రోజుల పాటు తన ఆటోలో ప్రయాణించేవారికి ఫ్రీ సర్వీస్ ను అందిస్తానని తెలిపారు. పాక్ ఉగ్రవాదానికి సరైన ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరముందనీ..అప్పుడే భారత్ వంక కన్నెత్తి చూసేందుకు పాకిస్థాన్ భయపడుతుందని..ఆటోవాలా తెలిపాడు. ఇలా దేశ వ్యాప్తంగా పలువురు తమకు తోచినట్లుగా..అమర జవాన్లకు విరాళాలను అందజేయటం..ఘనంగా నివాళులర్పించటం చేస్తున్నారు.