Vande Bharat 2: సెప్టెంబర్ 30 నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్-2 పరుగులు!
వందే భారత్ మొదటి వెర్షన్ రైతులో సీట్లను రీసైకిల్ చేసే సౌకర్యం లేదు. కానీ సెకండ్ వెర్షన్ రైతులో అన్ని కోచుల్లోని సీట్లను రీసైకిల్ చేయవచ్చట. ఇక మొదటగా ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు న్యూఢిల్లీ నుంచి వారణాసి మధ్య నడుస్తోంది. కాగా, మరొక రైలు న్యూఢిల్లీ నుంచి జమ్మూ కశ్మీర్లోని కట్రా మధ్య నడుస్తోంది.

Vande Bharat version 2 train likely to be flagged off on September 30
Vande Bharat 2: మరింత వేగవంతమైన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఈ నెల 30 నుంచి పరుగులు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ రైలు దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య నడవనుంది. ఇప్పటికే భద్రతాపరమైన అనుమతులు వచ్చినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. వందే భారత్ ఎక్స్ప్రెస్ మొదటి వెర్షన్ కంటే దీనిని 20 కిలోమీటర్ల అధిక వేగంతో ప్రయాణించే విధంగా రూపొందించారు.
కాగా, మొదటి వెర్షన్ 54.6 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగా తాజాగా రూపొందించిన రైలు 52 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందట. ఇకపోతే మొదటి వెర్షన్ రైలు గంటలకు 160 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించగా.. ఈ రైలు 180 కిలోమీటర్ల గరిష్ట వేగంతో నడవనుంది. ఇప్పటికే 20 రోజుల ట్రయల్ రన్స్ విజయవంతంగా పూర్తైనట్లు అధికారులు తెలిపారు. ఆగస్టు 12 చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి ట్రయల్ రన్ ప్రారంభించిన ఈ రైలుకు అనేర అధునాతన ఫీచర్లు ఉన్నట్లు చెబుతున్నారు.