Karnataka : లారీని ఢీ కొట్టి దాని వెనుక భాగంలో ఇరుక్కుపోయిన కారు.. కిలోమీటర్ ఈడ్చుకెళ్లిపోయి.. షాకింగ్ వీడియో
ఓ శాంట్రో కారు ట్రక్కును ఢీ కొట్టింది.. ట్రక్కు వెనుక భాగంలో ఇరుక్కుపోయింది. అది గమనించని ట్రక్కు డ్రైవర్ దానిని 1 కిలోమీటర్ లాక్కెళ్లిపోయాడు. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు.

Karnataka
Karnataka Accident : చెత్త లారీని ఓ కారు వేగంగా వచ్చి వెనుక నుంచి ఢీ కొట్టింది. అంతే ట్రక్కు వెనుక భాగంలో ఇరుక్కుపోయింది. అది గమనించని లారీ డ్రైవర్ అలాగే కిలోమీటర్ దూరం ఈడ్చుకెళ్లాడు. కర్ణాటకలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
కర్ణాటకలోని ఉడిపిలో ఓ శాంట్రో కారు డంపర్ ట్రక్కును ఢీ కొట్టింది. అంతే.. ఇరుక్కుపోయింది. కారును కిలోమీటర్ పైగా ఈడ్చుకెళ్లాడు. డ్రైవర్ ట్రక్కు వెనుక కారు ఇరుక్కుందన్న విషయం గమనించలేదు. జనం ట్రక్కును వెంబడిస్తుంటే భయంతో మరింత వేగంగా నడిపాడు. ఇక ప్రజలు ట్రక్కును అడ్డుకున్నారు. ప్రమాదానికి గురైన శాంట్రో కారు సాగర్ నుంచి మంగళూరు వెడుతున్నట్లు తెలుస్తోంది.
స్ధానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో గాయపడ్డ ఒక మహిళ, ఇద్దరు పురుషులను ఆసుపత్రికి తరలించారు. ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
The car stuck in the dumper of the tipper, the tipper dragged the Santro car for a kilometer in Karnataka’s Udupi. Santro car going from Sagar to Mangalore #mangalore #karnataka #udupi #viralvideo #latestnews #viraltoday #viralduplicate pic.twitter.com/Q6bwX3cUaj
— Viral Duplicate (@ViralDuplicate) July 17, 2023