Delhi : పెట్రోలు ధరలు పెరిగాయని ఎద్దుపై స్వారీ చేసిన వ్యక్తి.. జంతు హింస ఆపమంటు నెటిజన్లు ఫైర్
బుల్ రైడర్ పేరుతో సోషల్ మీడియాలో ఓ వ్యక్తి హల్చల్ చేస్తుంటాడు. ఎద్దుతో స్వారీ చేస్తూ చాలాచోట్ల కనిపిస్తుంటాడు. తాజాగా ఢిల్లీ రోడ్లపై కనిపించిన అతనిని చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేసారు.

Delhi
Delhi : ఢిల్లీ రోడ్లపై ఓ వ్యక్తి ఎద్దుపై స్వారీ చేస్తూ కనిపించిన వీడియో వైరల్ అయ్యింది. జంతు హింస ఆపమంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు. అతను అలా ప్రవర్తించడానికి కారణమేంటి?
Israel – Hamas War Update : గాజాలో బయటపడ్డ అతిపెద్ద హమాస్ ఉగ్రవాద సొరంగం.. వీడియో వైరల్
ఢిల్లీ వీధుల్లో కుందేలు ముఖం ఉన్న హెల్మెట్ ధరించి ఎద్దుపై ఓ వ్యక్తి స్వారీ చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. తనను తాను బుల్ రైడర్‌గా పిలుచుకుంటూ అదే పేరుతో సోషల్ మీడియాలో ఆ వ్యక్తి వీడియోలు షేర్ చేస్తుంటాడు. అనేక ప్రదేశాల్లో ఎద్దుపై తిరుగుతూ హల్చల్ చేస్తుంటాడు. సోషల్ మీడియాలో అతనికి మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ జంతు హింసకు పాల్పడుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
bull_rider_077 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి షేర్ చేసిన వీడియోలో ‘పెట్రోలు ధర పెరిగింది కాబట్టి నేను దాని స్ధానాన్ని చూపించాను’ (పెట్రోల్ మెహంగా హువాతో అబ్ మెనే ఉస్కో భీ ఔకాత్ దిఖా దీ) అనే శీర్షికతో ఈ వీడియోను షేర్ చేశారు. అతను ఎద్దును నడుపుతున్నప్పుడు బైక్ మీద కూర్చున్న వ్యక్తి ఈ వీడియోను రికార్డ్ చేయడం కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మండిపడ్డారు.
‘ఎద్దులు మీరు కూర్చోవడానికి కాదు.. జంతువులను హింసించడం మానేయండి’ అని ఒకరు.. ‘ప్రతి ఒక్కరూ మీలాగ ఆలోచిస్తూ పెట్రోలు చౌక అవుతుంది’ అని మరొకరు ఇలా వరుసగా కామెంట్లు పెట్టారు. మరికొందరు అతని చేష్టలతో ట్రాఫిక్ జామ్‌కి కారణమయ్యాడని విమర్శించారు. కొందరు మాత్రం అతనితో సెల్ఫీ దిగారు. ఏదో రకంగా వార్తల్లో ఉండాలనుకున్నాడేమో కానీ జంతు హింసకు పాల్పడుతున్నాడంటూ ఈ బుల్ రైడర్ విమర్శలు ఎదుర్కున్నాడు.
View this post on Instagram