Mumbai : సింగిల్ బెడ్రూమ్ ప్లాట్ హోం టూర్ చూస్తే ఉక్కిరిబిక్కిరి అవుతారు.. ఎక్కడంటే?
సౌత్ ముంబయిలో ఓ అపార్ట్‌మెంట్‌లో సింగిల్ బెడ్ రూం ప్లాట్ ఎలా ఉంటుందో తెలుసా? ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియో చూడండి.

Mumbai
Mumbai : సౌత్ ముంబయిలో సింగిల్ బెడ్రూమ్ ప్లాట్ చూస్తే షాకవుతారు. ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియో చూసి నెటిజన్లు ఆందోళన చెందారు. ముంబయిలో గృహ సంక్షోభాన్ని ఎత్తి చూపిస్తోందని అంటున్నారు.
Mumbai Model : 50 మంది పురుషులపై కిలాడీ ముంబయి మోడల్ వలపు వల
భారతదేశంలో అత్యంత ఖరీదైన నగరాల్లో ముంబయి అగ్రస్ధానంలో ఉంది. ముంబయిలో ఇల్లు కట్టుకోవడం అంటే చాలా కష్టం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అద్దెకు ఇల్లు దొరడం అంటేనే పెద్ద తలనొప్పి. విశాలంగా లేకపోయినా చిన్న అపార్ట్‌మెంట్లలో ప్రజలు నివాసించాల్సి వస్తోంది. ఇటీవల సుమిత్ పాల్వే అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ (me_palve) తను ఉండే చిన్న సింగిల్ బెడ్ రూమ్ ప్లాట్‌ను వీడియో తీసి షేర్ చేసాడు. ఈ వీడియో నెటిజన్లకు నవ్వు తెప్పించినా ఆందోళన కూడా కలిగించింది. పాల్వే తన అతి చిన్న ఇరుకైన అపార్ట్ మెంట్ చూపిస్తూ తన వీడియోలో వివరించాడు. దక్షిణ ముంబయిలో ఉండడంతో రూ.2.5 కోట్లు అయినా అపార్ట్ మెంట్ కొనడానికి రాజీ పడాల్సిందేనని చెప్పాడు.
Mumbai : ఆ ఇంటి 13 వ అంతస్తులో ఇండియన్ రాక్ పైథాన్ ప్రత్యక్షం.. ఉలిక్కిపడ్డ ముంబయి వాసులు
ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు ఉక్కిరిబిక్కిరి అయ్యామని కామెంట్ చేసారు. అతను టెర్రస్ చేరేవరకూ నాకు ఊపిరాడలేదని .. ఇది చూసిన తర్వాత ఢిల్లీ ఇళ్లు స్వర్గంలా అనిపిస్తాయని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేసారు. ముంబయిలోనే ఖచ్చితంగా ఉండాల్సి వస్తే ఇలాంటి ఇరుకైన ఇళ్లలో నివాసం ఉండక తప్పదనిపిస్తోంది.
View this post on Instagram