Madurai : మధురై అయ్యప్పన్ ఆలయంలో పాము కలకలం

మధురై అయ్యప్పన్ ఆలయంలో నాగు పాము ప్రత్యక్షమైంది. ఆలయం లోపల కనిపించిన నాగు పాము వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Madurai : మధురై అయ్యప్పన్ ఆలయంలో పాము కలకలం

Madurai

Updated On : November 15, 2023 / 2:41 PM IST

Madurai : తమిళనాడులోని మధురై అయ్యప్పన్ ఆలయంలో నాగుపాము ప్రత్యక్షమైంది. రెస్క్యూ టీమ్ దానిని రక్షించి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

Snake In Shoe : బాబోయ్.. విద్యార్థి స్కూల్ షూలో పాము, తల్లిదండ్రులూ బీకేర్ ఫుల్.. వీడియో వైరల్

మధురై అయ్యప్పన్ ఆలయంలో ఐదు అడుగుల నాగు పాము కనిపించింది. పూజ చేసేందుకు ఆలయ పూజారి లోనికి ప్రవేశించినపుడు పాము బుస కొడుతున్న శబ్దం వినిపించింది.  అలర్ట్ అయిన పూజారి రెస్క్యూ టీమ్‌కు సమాచారం అందించడంతో వెంటనే ఆలయానికి వచ్చి పామును రక్షించారు.  పామును నాగమలై అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

Delhi : రేవ్ పార్టీలో పాము విషం సర్వ్ చేసిన బిగ్ బాస్ విన్నర్..

శబరిమల యాత్ర ప్రారంభమైన నవంబర్, డిసెంబర్ నెలల్లో అయ్యప్పన్ ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో పాము రావడంతో కలకలం రేగింది.