Viral Video : మోమోలు అమ్ముతున్న ఇంగ్లీషు ప్రొఫెసర్ వీడియో వైరల్

ఇంటర్నెట్‌లో ఇటీవల రకరకాల ఫుడ్ కాంబినేషన్స్ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వీధి వ్యాపారులు జనాల్ని అట్రాక్ట్ చేయడానికి రకరకాల ప్రయోగాలు చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. తాజాగా ఓ ఇంగ్లీష్ ప్రొఫెసర్ సైతం స్ట్రీట్‌లో మోమోలు అమ్ముతూ వైరల్ అయ్యారు.

Viral Video : మోమోలు అమ్ముతున్న ఇంగ్లీషు ప్రొఫెసర్ వీడియో వైరల్

Viral Video

Updated On : August 27, 2023 / 9:40 AM IST

Viral Video : ఇంట్లో తయారు చేసిన మోమోలను టేస్ట్ చేయండి.. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారు.. అంటూ ఓ ఇంగ్లీష్ ప్రొఫెసర్ మోమోస్ అమ్ముతున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.

Delhi Metro : రణరంగంగా మారిన మెట్రో.. లేడీస్ కోచ్ ఎక్కిన వ్యక్తితో ఇద్దరు మహిళలు వాగ్వాదం.. వీడియో వైరల్

ఇంటర్నెట్‌లో రకరకాల ఫుడ్ తయారీ వీడియోలు చూస్తున్నాం. మెక్సికన్ పానీ పూరి, ఫాంటా మ్యాగీ, పెగురు గులాబ్ జామూన్ ఇలా అనేక ప్రయెగాలు చేస్తున్నారు. ఇక ప్రొఫెసర్లు సైతం స్ట్రీట్‌లో ఫుడ్ అమ్ముతూ వైరల్ అవుతున్నారు. ‘ఇంట్లో తయారు చేసిన మోమోలు ప్రయత్నించండి. రుచి మీకు తప్పకుండా నచ్చుతుంది. చాలా పరిశుభ్రంగా తయారు చేసారు.  మీరు దీని ప్రత్యేక రుచితో పాటు లోపల ఉండే పదార్ధాల గురించి తెలుసుకుంటారు. మోమోస్ షెల్ చాలా సన్నగా ఉంది’ అని మోమోస్ గురించి ఇంగ్లీష్‌లో  వివరిస్తూ జనాల్ని అట్రాక్ట్ చేసేలా విక్రయిస్తున్నారు ఇంగ్లీష్ ప్రొఫెసర్.

Harsh Goenka : తమ కంపెనీలో నైపుణ్యం ఉన్న ఉద్యోగుల కొరత ఉందంటూ హర్ష్ గోయేంకా చేసిన ట్వీట్ వైరల్

lifewithdarpan ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ‘బాదం కి చట్నీ, షెజ్వాన్ సాస్‌తో ఇంట్లో తయారు చేసిన మోమోలను విక్రయిస్తున్న ఇంగ్లీష్ ప్రొఫెసర్’ అనే శీర్షికతో షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ‘నేను టేస్ట్ చేయలేదు కాబట్టి మోమోస్‌కి రేటింగ్ ఇవ్వలేను .. కానీ మీ ప్రయత్నానికి 101 మార్కులు’ అని .. ‘మోమోలను సుషీ తయారు చేసినట్లు వివరిస్తున్నారు’ అని నెటిజన్లు కామెంట్లు పెట్టారు. పాఠాలు చెప్పుకునే ప్రొఫెసర్‌కి  మోమోలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏంటని కొందరు ప్రశ్నించారు. ఈ వీడియో మాత్రం 11.5 మిలియన్ల వ్యూస్‌తో వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Darpan Khurana (@lifewithdarpan)