Work From Wedding : కొన్ని క్షణాల్లో పెళ్లి..ల్యాప్‌టాప్ పెట్టుకుని వర్క్ చేసిన వరుడు
వరుడు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో అతను మండపంలో కూర్చొని ల్యాప్ టాప్ లో ఏదో వర్క్ చేస్తున్నాడు. కొద్ది సమయం అయిపోయిన తర్వాత..ల్యాప్ టాప్ ఎవరికో ఇచ్చేశాడు.

Work From Wedding
Groom With Laptop : శుభకార్యాలు జరిగితే ఇంట్లో సందడి సందడిగా ఉంటుంది కదా. అందరూ పనుల్లో బిజీ బిజీగా ఉండడం కనిపిస్తుంటుంది. పెళ్లిళ్లు అయితే చెప్పనక్కర్లేదు. కుటుంబసభ్యులు, బంధు మిత్రులతో అంతా సందడిగా ఉంటుంది. వధువు, వరుడు విషయంలో చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం కరోనా సమయం గడుస్తున్నది కాబట్టి వివాహాలు నిరాడంబరంగా జరుగుతున్నాయి.
Read More : MP Malothu Kavita : మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితకు 6 నెలల జైలు శిక్ష
అయితే..కొన్ని పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వధువు, వరుడు డ్యాన్స్, ఇతర కుటుంబసభ్యలు ఫన్నీ వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా..ఓ వరుడు పెళ్లి మండపంలో చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఓ ప్రాంతంలో పెళ్లి జరుగుతోంది. పెళ్లి మంటపాన్ని అందంగా అలకరించారు. అందరూ ఏదో ఏదో పనులు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. వరుడు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో అతను మండపంలో కూర్చొని ల్యాప్ టాప్ లో ఏదో వర్క్ చేస్తున్నాడు.
Read More : Salony Luthra : ‘భానుమతి & రామకృష్ణ’ ఫేమ్ సలోని లూత్రా పిక్స్..
కొద్ది సమయం అయిపోయిన తర్వాత..ల్యాప్ టాప్ ఎవరికో ఇచ్చేశాడు. దీంతో కుటుంబసభ్యులు మంటపం వద్దకు వచ్చారు. వివాహతంతును ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియోలో తెగ వైరల్ అయ్యింది. dulhaniyaa పేరిట ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు చేశారు. కరోనా కారణంగా చాలా మంది ఇంట్లో నుంచే వర్క్ చేసిన సంగతి తెలిసిందే. వర్క్ ఫ్రం హోమ్ అనేది చాలా మంది జీవితాల్లో భాగంగా మారిపోయింది. ఇంట్లో పనులు చూసుకుంటూనే…ఆఫీసు వర్క్ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో..వర్క్ ఫ్రం వెడ్డింగ్..అనేలా ఓ ఉద్యోగి..ఏకంగా పెళ్లి మంటంపై ల్యాప్ టాప్ తో కూర్చొన్నారు. ఫన్నీగా ఉన్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ నవ్వేసుకుంటున్నారు.
View this post on Instagram