Pani Puri Factory : మీరెంతో ఇష్టంగా తినే పానీ పూరీలు ఫ్యాక్టరీలో ఎలా తయారవుతాయో తెలుసా?
పానీ పూరీ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. కొందరు అపరిశుభ్రత కారణంగా ఈ స్ట్రీట్ ఫుడ్ తినడానికి సంకోచిస్తారు. అసలు పానీ పూరీల్ని ఎక్కడ తయారు చేస్తారు? ఎలా తయారు చేస్తారు? మేకింగ్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Pani Puri Factory
Pani Puri Factory : పానీ పూరీని ఇష్టపడని వారుండరు. ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపిస్తాయి. ఈ ఫేమస్ స్ట్రీట్ ఫుడ్‌కి కావాల్సిన చిన్న చిన్న పూరీలు అసలు ఎలా తయారు చేస్తారు? ఎక్కడ తయారౌతాయి? అంటే ఓ ఫ్యాక్టరీలో తయారవుతున్న పానీ పూరీ తయారీ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
Gastroenteritis: వర్షాల్లో పొట్ట భద్రం.. పానీపూరీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
ఇండియాలో పానీ పూరీ ఎంత ఫేమస్ అనేది అందరికీ తెలుసు. పిలిచే పేర్లు, దీంట్లో వాడే పదార్ధాల్లో కాస్త తేడాలున్నా ఈ స్ట్రీట్ ఫుడ్ తినడానికి చాలామంది ఇష్టపడతారు. అయితే కొంతమంది సంకోచిస్తారు. దీని కోసం వాడే నీరు పరిశుభ్రంగా ఉందా? ఈ ఫుడ్ ఇచ్చే వ్యక్తి గ్లౌజులు వేసుకున్నాడా? లేదా? ఇలా కొంతమంది ఎంతో ఇష్టం ఉన్నా తినడానికి వెనకాడతారు. పానీ పూరీలు ఎంత పరిశుభ్రంగా తయారు చేస్తారు అనడానికి ఉదాహరణగా నిలిచింది ఓ వీడియో. సూరత్ లోని ఓ ఫ్యాక్టరీలో పానీ పూరీలు తయారు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Non Veg Pani Puri : వారెవ్వా.. చికెన్, మటన్, రొయ్యలు, చేపలతో పానీపూరీ ..
the__bearded__foodie అనే ఫుడ్ వ్లాగర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో ఓ కంటైనర్‌లో లెక్కలేనన్ని పానీ పూరీలు ఓ హెవీ మెషీన్‌లో వేయిస్తున్నట్లు మొదలవుతుంది. ఆ తరువాత పిండిని కలపడం, ఆ తరువాత మనుషుల ప్రమేయం లేకుండానే రౌండ్ పలకలతో భారీ రోలర్‌పై పూరీలు తయారవడం, పానీ పూరీలు తయారైన తరువాత పెద్ద ఫ్రయ్యర్‌లో వేయించినవి ట్రేలోకి రావడం.. చివరగా ప్యాకెట్‌లో సీలు కావడం.. కనిపిస్తుంది. ‘అత్యంత పరిశుభ్రమైన పానీ పూరీ’ అనే శీర్షికతో ఈ వీడియోను షేర్ చేసారు. దీని పరిశుభ్రతను మెచ్చుకుంటూ కొందరు.. అపరిశుభ్రంగా అమ్ముతుంటారని కొందరు కామెంట్లు చేసారు.
View this post on Instagram