Uttar Pradesh : ఓ వ్యక్తి బైక్‌లో గన్.. పోలీసులు పెట్టారంటున్న కుటుంబం.. సీసీ కెమెరాలో ఏం కనిపించిందంటే?

మీరట్‌లో ఓ సీసీ ఫుటేజ్ వైరల్ అవుతోంది. బైక్‌లో ఓ పోలీసు ఏదో పెడుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. బైక్‌లో ఇల్లీగల్ గన్ ఉందంటూ పోలీసులు ఓ కుటుంబంలోని వ్యక్తిని అరెస్టు చేసారు. అసలు ఏం జరిగింది?

Uttar Pradesh : ఓ వ్యక్తి బైక్‌లో గన్.. పోలీసులు పెట్టారంటున్న కుటుంబం.. సీసీ కెమెరాలో ఏం కనిపించిందంటే?

Uttar Pradesh

Uttar Pradesh : మీరట్‌లో ఓ వ్యక్తి బైక్‌లో అనుమానితుడు గన్‌ను వదిలి వెళ్లిన వీడియో సీసీ కెమెరాలో వైరల్ అవుతోంది. అది పోలీసుల పనే అని వ్యక్తి కుటుంబ సభ్యులు అంటుంటే.. ఆ కుటుంబంలోని ఒకరిని అరెస్టు చేసారు పోలీసులు.

Srikanth Tyagi: నోయిడా టు మీరట్.. పోలీసులకు చిక్కకుండా 15 సార్లు కార్లు మార్చిన శ్రీకాంత్ త్యాగి

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో సీసీటీవీ ఫుటేజ్ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పోలీసు సిబ్బంది ఒకరు పిస్టల్‌ను మోటార్ బైక్‌‌కి ఉన్న బ్యాగ్‌లో వదిలి వెళ్తున్నట్లు కనిపించింది. ఓ భూవివాదం కేసులో ఇరుక్కున్న అశోక్ త్యాగి అనే వ్యక్తి ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా పోలీసులు త్యాగి కుమారుడైన అంకిత్‌ను అరెస్టు చేసారు. దీంతో అశోక్ త్యాగి కుటుంబం సీసీఫుటేజ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.

త్యాగి పంచుకున్న వీడియోలో పోలీసు ఇంట్లోకి వచ్చినట్లు బయట పార్క్ చేసిన బైక్‌లో ఏదో ఉంచినట్లు కనిపించింది. తరువాత వేరే పోలీసు అధికారులు వచ్చి బైక్ నుండి పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఆ బైక్ తమదే అని.. భూవివాదంలో ప్రమేయం ఉన్న మరో పక్షంతో పోలీసులు చేతులు కలిపి కావాలని బైక్‌లో పిస్టల్ పెట్టారని అశోక్ త్యాగి వైఫ్ రాఖీ త్యాగి పేర్కొంది. సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపిస్తోంది.

Meerut: రెండో పెళ్లిని వ్యతిరేకించాడని ఒక్కగానొక్క కొడుకు తల పగలగొట్టి దారుణంగా హత్య చేసిన తండ్రి

మీరట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దేహత్ కమలేష్ బహదూర్ సంఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నారు. ఏదైనా తప్పు జరిగినట్లే రుజువైతే చట్టపరంగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు. ఘటనలో పాల్గొన్న ఇద్దరు కానిస్టేబుళ్లను గుర్తించి ప్రశ్నిస్తున్నారు.