Uttar Pradesh : మద్యం మత్తులో సిబ్బంది, ప్లాట్‌ఫారమ్‌ ఎక్కేసిన రైలు..

మధురలో ప్యాసింజర్ రైలు ప్లాట్‌ఫారమ్ ఎక్కేసింది. రైలు సిబ్బంది వీడియో కాల్‌లో మాట్లాడుతూ ఉండగా ఈ సంఘటన జరిగింది. ఈ ఘటన జరగడానికి అసలు కారణం ఏంటి?

Uttar Pradesh : మద్యం మత్తులో సిబ్బంది, ప్లాట్‌ఫారమ్‌ ఎక్కేసిన రైలు..

Uttar Pradesh

Updated On : September 28, 2023 / 3:59 PM IST

Uttar Pradesh : ఉత్తరప్రదేశ్ లోని మధురలో ప్యాసింజర్ రైలు ప్లాట్‌ఫారమ్‌పైకి ఎక్కిన విచిత్రమైన సంఘటనకి సంబంధిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనలో ఒక మహిళకు గాయాలయ్యాయని తెలుస్తోంది.

Divyabharathi : మధుర మీనాక్షి టెంపుల్ లో దివ్యభారతి..

మధురలో ప్యాసింజర్ రైలు ప్లాట్‌ఫారమ్ ఎక్కేసింది. ప్రమాదం జరిగిన క్షణాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రయాణికులంతా రైలు దిగిన తర్వాత రైల్వే ఉద్యోగి సచిన్ ఇంజన్ క్యాబిన్‌లోకి వెళ్తున్నట్లు వీడియోలో కనిపించింది. సచిన్ వీడియో కాల్‌లో ఎవరితోనో మాట్లాడుతున్నట్లు కనిపిస్తాడు. చేతిలో ఉన్న తన బ్యాగ్‌ని ఇంజన్ థొరెటల్‌ (థొరెటల్ ఇంజిన్‌కు ఇంధనం లేదా శక్తి ప్రవాహాన్ని నియంత్రించే పరికరం) పైన ఉంచాడు. మళ్లీ తన ఫోన్ కాల్‌లో బిజీ అయిపోయాడు. సడెన్‌గా రైలు పట్టాలు ఎక్కేసింది. ఈ ఘటనలో ఓ మహిళకు గాయాలైనట్లు తెలుస్తోంది.

Robbery In Jammu Train: తుపాకులతో రైలెక్కి కాల్పులు జరుపుతూ వీరంగం.. జమ్మూ రైలులో బీభత్సం సృష్టించిన దుండగులు

థొరెటల్ పైన సచిన్ పెట్టిన బ్యాగ్ ఒత్తిడి కారణంగా రైలు ప్లాట్‌ఫారమ్ పైకి వెళ్లిపోయిందని అందువల్ల ప్రమాదం సంభవించిందని అధికారులు చెబుతున్నారు. డివిజనల్ రైల్వే మేనేజర్ తేజ్ ప్రకాష్ అగర్వాల్ మాట్లాడుతూ సచిన్‌తో సహా ఐదుగురిని సస్పెండ్ చేశామని, ఘటనకు ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించామని చెప్పారు. తాళాలు తీసుకునేందుకు క్యాబిన్‌లోకి వెళ్లిన సచిన్‌ ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్నట్లు విచారణలో తేలింది.