Viral Video: ప్రాణంలేని వాటికి కూడా పుట్టినరోజు వేడుక జరుపుతారా? ఊహించని చిత్ర విచిత్రం

సాధారణంగా పురుషులకు అంతగా ఫీలింగ్స్ ఉండవని కొందరు అమ్మాయిలు అనుకుంటారని,

Viral Video: ప్రాణంలేని వాటికి కూడా పుట్టినరోజు వేడుక జరుపుతారా? ఊహించని చిత్ర విచిత్రం

పిల్లల పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడమంటే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు చాలా ఇష్టం. అలాగే, చాలామంది కుక్కపిల్లల, పిల్లుల పుట్టినరోజు వేడుకలను కూడా చేస్తుంటారు. అయితే, ఓ వ్యక్తి మరీ వెరైటీగా తన బైకుకు పుట్టినరోజు వేడుక చేసి అందరినీ ఆశ్చర్యపర్చాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను ”బాబు భయ్యా” అనే పేరుతో ఉన్న ఎక్స్ యూజర్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో ఇది వైరల్ అవుతోంది. ప్రాణంలేని వాటికి కూడా పుట్టినరోజు వేడుక చేస్తారా? అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మనుషులకు పుట్టినరోజు వేడుకను చేసినట్లే బైక్ ముందు కేక్ కట్ చేసి, బైకుకు పూలదండ వేసి, బొట్లు వేసి ఈ వేడుకను చేశారు.

అలాగే మంచి పాటలు పెట్టుకుని ఎంజాయ్ చేశారు. సాధారణంగా పురుషులకు అంతగా ఫీలింగ్స్ ఉండవని కొందరు అమ్మాయిలు అనుకుంటారని, కానీ, ఈ వీడియోను చూస్తే వారు తమ అభిప్రాయాన్ని మార్చుకుంటారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోకు ఇప్పటికే లక్షలాది వ్యూస్ వచ్చాయి.

Also Read: బాబోయ్.. సమోసాలో కప్ప కాలు.. ఈ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..