Viral Video: మామిడికాయల దొంగలు.. అందరూ చదువుకున్నవారే.. ఎగబడి ఎత్తుకెళ్లారు.. కాస్త మనుషుల్లా ప్రవర్తించండ్రా బాబూ..
దొరికినకాడికి ఎత్తుకెళ్లారు.. ఇంకాస్త టైం ఇస్తే టేబుల్, కవర్ కూడా ఇంటికి తీసుకెళ్లేవారు..

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో తాజాగా మ్యాంగో ఫెస్టివల్ జరిగింది. ఈ ప్రోగ్రాం ముగియగానే చాలా మంది ఎగబడి మామిడిపండ్లను ఎత్తుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కొందరు బ్యాగుల్లో, మరి కొందరు జేబుల్లో, కొందరు మహిళలు చీర కొంగుల్లో పెట్టుకుని మామిడిపండ్లను తీసుకెళ్లారు. మరికొందరు మహిళలు, పురుషులు చేతుల్లో మామిడిపండ్లు పట్టుకుని ఆనందంగా నవ్వుకుంటూ తీసుకెళ్లారు. వీలైనన్ని పండ్లను కొట్టేయాలన్న ఉత్సాహంతో వారు ఎగబడిన తీరు నవ్వులు పూయిస్తోంది.
అక్కడి ప్రజల తీరుపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కొందరు తీవ్ర విమర్శలు చేస్తూ కామెంట్లు చేశారు. “ఇదే మన సివిక్ సెన్స్. మిగిలిన దేశాల ప్రజలకు భారతీయులంటే ఎందుకు ఇష్టం ఉండదో దీన్ని చూస్తే అర్థమవుతుంది” అని ఓ యూజర్ కామెంట్ చేశాడు.
“వారంతా 16 చేతులతో పుట్టి ఉంటే బాగుండేది, ఎక్కువ మామిడి పండ్లను చేతుల్లో తీసుకెళ్లేవారు” అంటూ మరో యూజర్ సెటైర్ వేశారు.
“ఇంకాస్త టైం ఇస్తే టేబుల్, కవర్ కూడా ఇంటికి తీసుకెళ్తారు” అని మరొకరు కామెంట్ చేశారు.
“భారతదేశానికి ‘సివిక్ సెన్స్ డే’ కావాలి. స్కూళ్లు, కాలేజీల్లో కామన్ సెన్స్ సబ్జెక్ట్ పెట్టాలి” అని మరొకరు అన్నారు.
“మనం మన సంస్కృతి, వారసత్వం అంటూ గొప్పలు చెప్పుకుంటాం, కానీ రోడ్డుపై ట్రక్కు పడిపోయినా అందులో వస్తువులు లూటీ చేసి తీసుకెళ్తాం” అంటూ మరో యూజర్ స్పందించాడు.
Last day of Mango festival in Lucknow.
This is our civic sense. No wonder, other countries don’t want Indians on their land. pic.twitter.com/iFFjM7RGvp
— Tarun Gautam (@TARUNspeakss) July 7, 2025