మెడను చుట్టిన కొండచిలువ.. వీడియో వైరల్

  • Published By: veegamteam ,Published On : October 17, 2019 / 09:12 AM IST
మెడను చుట్టిన కొండచిలువ.. వీడియో వైరల్

Updated On : October 17, 2019 / 9:12 AM IST

కేరళలోని ఓ కళాశాల భవన నిర్మాణం కోసం చెట్లను నరుకుతుండగా ఉన్నట్టుండి పొదల్లోంచి బయటపడ్డ కొండచిలువ ఓ కూలి మెడను చుట్టేసి అతడిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇతర కూలీల సాయంతో కొండచిలువ బారినుంచి బయటపడి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు ఆ కూలీ. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే… తిరువనంతపురంలోని కేరళ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్కూలు భవన నిర్మాణం కోసం పొదల్లో ఉన్న చెత్తచెదారాన్ని శుభ్రం చేస్తూ.. చెట్లను నరుకుతున్నారు కొంత మంది కూలీలు. ఆ సమయంలో భువనచంద్రన్‌ నాయర్‌ అనే వ్యక్తికి పది అడుగుల కొండచిలువ కనిపించింది. దీంతో ఆ వ్యక్తి నెమ్మదిగా దానిని పట్టుకునే ప్రయత్నం చేయగా.. అది ఒక్కసారిగా అతడి మెడను చుట్టేసింది. 

దీంతో సమీపంలో పనిచేస్తున్న మరికొంతమంది కూలీలు నాయర్ అరుపులు విని వెంటనే వచ్చి ఆ కొండచిలువ మూతి బిగించి ఎలాగోలా దానిని నాయర్‌ మెడపై నుంచి లాగి పడేశారు. అనంతరం దానిని అటవీ అధికారులకు అప్పగించగా.. వారు అడవిలో వదిలేశారు. అక్కడే ఉన్నవారు వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది.