ఓటు వేసి వస్తుండగా ట్రాక్టర్ బోల్తా: ముగ్గురు మృతి 

  • Published By: veegamteam ,Published On : April 11, 2019 / 10:14 AM IST
ఓటు వేసి వస్తుండగా ట్రాక్టర్ బోల్తా: ముగ్గురు మృతి 

Updated On : April 11, 2019 / 10:14 AM IST

మహారాష్ట్ర: లోక్ సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని గడ్చిరోలి జిల్లా శంకర్‌పూర్ గ్రామ సమీపంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడటంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 9 మంది తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే స్పందిచి గాయపడిన గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.
 

కాగా వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. లోక్ సభ ఎన్నికలు జరగుతున్న క్రమంలో సమీపంలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుని తిరిగి గ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.