సుప్రీం లాయర్ కీలక వ్యాఖ్యలు…సీజేఐపై ఆరోపణలకు 1.5కోట్లు లంచం

చీఫ్ జిస్టిస్ రంజన్ గొగొయ్ పై లైంగిక వేధింపుల ఆరోపణల వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని సుప్రీంకోర్టు లాయర్ ఉత్సవ్ బెయిన్స్ తెలిపారు.గొగొయ్ ను సుప్రీం కోర్టు నుంచి పంపించివేసేందుకే ఈ కుట్ర జరిగినట్లు తెలిపారు. గొగొయ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిణికి మద్దతుగా,గొగొయ్ కు వ్యతిరేకంగా మీడియా సమావేశం నిర్వహించాలని కొన్ని రోజుల క్రితం ఓ అజ్ణాత వ్యక్తి తనను కలిసి రూ.1.5కోట్లు లంచం ఇవ్వజూపాడని ఉత్సవ్ ఆరోపించారు.అంతేకాకుండా కేవలం ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా దగ్గర మాత్రమే ప్రెస్ కాన్షరెన్స్ నిర్వహించాలని ఆ వ్యక్తి తనను కోరినట్లు ఉత్సవ్ తెలిపారు.
అయితే లంచం తీసుకునేందుకు తాను నిరాకరించానని,వెంటనే ఆఫీస్ వదిలి వెళ్లాలని అతనని తాను హెచ్చరించానన్నారు.దీంతో ఆ వ్యక్తి ఆశారాం బాపు రేప్ కేసులో బాధితురాలిగా ఉన్న మహిళ బంధువునని తనతో చెప్పాడని, గొగొయ్ ను రిజైన్ చేయించేందుకు చాలా పెద్ద కుట్ర జరుగుతుందని,కావున మాకు సహకరించాలంటూ ఆ వ్యక్తి తనను ఒప్పించే ప్రయత్నం చేశాడని ఉత్సవ్ అన్నారు.