బాల్కనీ బాటిల్ రచ్చ : ముగ్గురిని కత్తితో పొడిచాడు 

ఓ వాటర్ బాటిల్ తెచ్చిన రచ్చకు ముగ్గురు కత్తిపోట్లకు గురయ్యారు. అనుకోకుండా జరిగిన ఈ ఘటనకు విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి కత్తితో ముగ్గురిని తీవ్రంగా పొడిచాడు

  • Published By: veegamteam ,Published On : January 17, 2019 / 10:35 AM IST
బాల్కనీ బాటిల్ రచ్చ : ముగ్గురిని కత్తితో పొడిచాడు 

ఓ వాటర్ బాటిల్ తెచ్చిన రచ్చకు ముగ్గురు కత్తిపోట్లకు గురయ్యారు. అనుకోకుండా జరిగిన ఈ ఘటనకు విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి కత్తితో ముగ్గురిని తీవ్రంగా పొడిచాడు

ఢిల్లీ : ఓ వాటర్ బాటిల్ తెచ్చిన రచ్చకు ముగ్గురు కత్తిపోట్లకు గురయ్యారు. అనుకోకుండా జరిగిన ఈ ఘటనకు విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి కత్తితో ముగ్గురిని తీవ్రంగా పొడిచాడు. ఈ దాడిలో ఒకరు ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఖ్యాలా ఏరియాలో జరిగిన ఈ దారుణంతో స్థానికంగా కలకలం రేగింది. బాల్కనీ కూర్చుని సరదగా ఆడుకుంటుండగా..సునీత అనే మహిళ కుమారుడు ఆకాశ్ చేతిలో వున్న బాటిల్ పొరపాటున జారిపోయింది. అలా జారిన బాటిల్ మహ్మద్ అహ్మద్ అనే 40 ఏళ్ల వ్యక్తిపై పడింది. దీంతో అహ్మద్ సునీతపై విరుచుకుపడ్డారు.

ఇలా ఇద్దరి మధ్య రాజుకున్న ఘర్షణతో విచక్షణ కోల్పోయిన అహ్మద్ కత్తితో సునీత..ఆమె భర్త వీరు..వారి కుమార్తె ఆకాశలపై తీవ్రంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో స్థానికులు కల్పించుకుని వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో అహ్మద్ పై ఎవరు కేసు పెట్టకుండానే నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తానే వీరు కుటుంబంపై దాడి చేశానని పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.