#TwinTowers: ట్విన్ టవర్లు కూల్చేందుకు బటన్ నొక్కుతూ కన్నీళ్లు పెట్టిన అధికారి

కుతుబ్ మినార్ కంటే ఎత్తైన ఈ ట్విన్ టవర్ కూల్చివేత దేశ చరిత్రలో నిలిచిపోనుంది. దేశంలో ఇప్పటి వరకు కూల్చిన అతిపెద్ద భవనంగా ఇది రికార్డుకు ఎక్కింది. కిలోమీటరు దూరంలో ఉండి బటన్ నొక్కగానే.. తొమ్మిదంటే తొమ్మిదే సెకన్లలో భవనం శిథిలాల్లో కలిసిపోయింది. కాగా, ఈ ట్విన్ టవర్స్ కూల్చివేతకు ఉపయోగించిన పేలుడు పదార్థాలు మూడు అగ్ని-5 మిసైల్స్ లేదంటే 4 పృథ్వి మిసైల్స్ లేదంటే 12 బ్రహ్మోస్ మిసైల్స్‭తో సమానమని అంటున్నారు.

#TwinTowers: ట్విన్ టవర్లు కూల్చేందుకు బటన్ నొక్కుతూ కన్నీళ్లు పెట్టిన అధికారి

We were crying says Man who pressed button that brought down twin towers

Updated On : August 28, 2022 / 8:20 PM IST

#TwinTowers: కాగా, ట్విన్ టవర్లను కూల్చే సమయంలో పేలుడు పదార్థలు విస్ఫోటనం చెండానికి బటన్ నొక్కిన అధికారి అనంతరం భావోద్వేగానికి లోనయ్యారట. ఆయనతో పాటు తన టీం మొత్తం కన్నీళ్లు పెట్టుకుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‭ ఎడిఫైస్ ఇంజనీరింగ్ అధికారి చేతన్ దత్తా ఆధ్వర్యంలో జరిగింది. ఆయనతో పాటు ఏడుగురు విదేశీ నిపుణులు, 20 మంది ఎడిఫైస్ ఇంజనీర్లు ఈ ఆపరేషన్‭లో పాల్గొన్నారు. భవనం కూలిన అనంతరం వార్నింగ్ సైరన్ రాగానే తన టీం మొత్తం మౌనంగా ఉండిపోయిందని, ఎవరూ ఏమీ మాట్లాడలేదని, తామంతా బయటికి కక్కలేని వేధనలో మునిగిపోయి ఉన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.

దాదాపు వెయ్యి కోట్ల ఖర్చుతో నిర్మించిన నోయిడాలోని ట్విన్ టవర్స్.. ఆదివారం మధ్యాహ్నం 2:45 నిమిషాలకు 9 సెకన్లలో నేలమట్టమయ్యాయి. మధ్యాహ్నం 2:15 గంటలకు ప్రారంభమైన డిమోలిష్ ఆపరేషన్.. 30 నిమిషాల్లో పూర్తి చేసుకుంది. సెక్టార్ 93ఏలో ఉన్న ఈ ట్విన్ టవర్స్ కూల్చివేతకు 3,700 కిలోల పేలుడు పదార్థాలను వినియోగించారు. రెండు భవనాల్లో మొత్తం 7,000 రంధ్రాలు, 20,000 సర్క్యూట్స్ ఏర్పాటు చేశారు. ప్రతి అంతస్తులో పేలుడు పదార్థాలను అమర్చి.. వాటర్ ఫాల్ టెక్నిక్ అనే పద్దతిలో భవనాలు నిలువుగా కింద పడేలాగా ప్లాన్ చేసి, పని పూర్తి చేశారు.

కుతుబ్ మినార్ కంటే ఎత్తైన ఈ ట్విన్ టవర్ కూల్చివేత దేశ చరిత్రలో నిలిచిపోనుంది. దేశంలో ఇప్పటి వరకు కూల్చిన అతిపెద్ద భవనంగా ఇది రికార్డుకు ఎక్కింది. కిలోమీటరు దూరంలో ఉండి బటన్ నొక్కగానే.. తొమ్మిదంటే తొమ్మిదే సెకన్లలో భవనం శిథిలాల్లో కలిసిపోయింది. కాగా, ఈ ట్విన్ టవర్స్ కూల్చివేతకు ఉపయోగించిన పేలుడు పదార్థాలు మూడు అగ్ని-5 మిసైల్స్ లేదంటే 4 పృథ్వి మిసైల్స్ లేదంటే 12 బ్రహ్మోస్ మిసైల్స్‭తో సమానమని అంటున్నారు.

Viral Video: పరిగెత్తుకుంటూ వచ్చి అంపైర్ ప్యాంట్ లాగిన బౌలర్.. ఆ తర్వాత రియాక్షన్ ఏంటంటే?