Bengal Poll Violence : బెంగాల్ హింసపై కమిటీ వేయాలని కోరుతూ..CJI కు 2,093 మంది మహిళా అడ్వకేట్లు లేఖ
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల తరువాత జరిగిన హింసల గురించి కమిటీ వేయాలని కోరుతూ..సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు 2,093 మంది మహిళా న్యాయవాదులు లేఖ రాశారు. చిన్నారులు, మహిళలు, ఎస్సీలపై దాడి జరిగిందని లేఖలో వివరిస్తూ..వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళా న్యాయవాదులు సీజేఐకు లేఖ రాశారు. ఈ ఘటనలపై ఓ కమిటీ వేసి..కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని విజ్ఞప్తి చేశారు.

Bengal Poll Violence
West Bengal poll violence: పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు ఎంత ఉత్కంఠగా జరిగాయో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ముఖ్యంగా టీఎంసీ, బీజేపీ పార్టీలకు మధ్య మాటల యుద్ధం..దాడులు చోటుచేసుకున్నాయి. ఓ దాడిలో మమతాబెనర్జీకి కాలుకి గాయమైన విషయం తెలిసిందే. గాయపడిన గాయంతోనే ఒంటికాలితో ఎట్టకేలకూ బీజేపీపై విజయం సాధించారు మమతా. అలాగే ఎన్నికల తరువాత కూడా బెంగాల్లో పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి, ఈ ఘటనల్లో మహిళలు, చిన్నారులకు కూడా గాయాలయ్యాయి.
ఈ హింసల గురించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు మహిళా లాయర్లు ఓ లేఖ రాశారు. బెంగాల్ ఎన్నికల అనంతరం జరిగిన హింసపై కమిటీ వేయాలని కోరుతు..2,093 మంది మహిళా న్యాయవాదులు సీజేఐకి లేఖ రాశారు. చిన్నారులు, మహిళలు, ఎస్సీలపై దాడి జరిగిందని లేఖలో వివరిస్తూ.. వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళా న్యాయవాదులు సీజేఐకు లేఖ రాశారు. ఈ ఘటనలపై ఓ కమిటీ వేసి..కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని విజ్ఞప్తి చేశారు.
వివిధ రాష్ట్రాలకు చెందిన 2,093 మంది మహిళా న్యాయవాదులు అన్ని వివరాలను లేఖలో ప్రస్తావిస్తూ సీజేఐకి లేఖ రాశారు. బెంగాల్ లో జరిగిన హింసలో చిన్నారులు, మహిళలు, ఎస్సీలపై దాడి జరిగిందని లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసపై ప్రత్యేక దర్యాప్తు కమిటీని నియమించాలని సీజేఐని కోరారు. నిర్దిష్ట కాలపరిమితితో న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని విన్నవించారు. బాధిత కుటుంబాలకు పరిహారం అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.