#GOBACKAMITSHAH : అమిత్ షాకు నిరసన సెగ

కేంద్ర హోం మంత్రి అమిత్ షా..బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వెస్ట్ బెంగాల్‌లోని కోల్ కతాకు చేరుకున్నారు. కానీ వీరి రాకను..పలు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. వామపక్ష విద్యార్థి సంఘాల కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఢిల్లీలో జరిగిన అల్లర్లపై కేంద్రానిదే బాధ్యత అని, హోం మంత్రి పదవి నుంచి షా తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అల్లర్లకు కారణం..బీజేపీయేనని, అగ్గి రాజేసింది..షానేంటూ మండిపడ్డారు.
గత సంవత్సరం డిసెంబర్ నెలలో పౌరసత్వ సవరణ చట్టం (CAA)అమలు చేసిన అనంతరం తొలిసారిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా..2020, మార్చి 01వ తేదీ ఆదివారం కలకత్తా ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. షాహీద్ మినార్ మైదానంలో జరిగే ప్రజార్యాలీలో ఆయన పాల్గొననున్నారు. ప్రజల్లో నెలకొన్న సందేహాలను తొలగించేందుకు షాను రంగంలోకి దించింది బీజేపీ. అందులో భాగంగా కోల్‌కతాకు పంపాలని నిర్ణయం తీసుకుంది.
కోల్ కతా విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం పార్టీ సీనియర్ నాయకులు కలిసిన తర్వాత..NSG ఆఫీసు కార్యలయానికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2.40గంటలకు NPRకు సంబంధించిన ప్రణాళికపై ప్రజలకు ఆయన వివరించనున్నారు.
ఈ పర్యటనను వామపక్ష పార్టీలే కాకుండా, ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు రాజకీయేతర సంఘాలు వ్యతిరేకించాయి. ఎయిర్ పోర్టు వద్ద నల్ల రంగు బెలూన్లు ఎగురవేసి నిరసన తెలిపారు. అమిత్ షా గో బ్యాక్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేపట్టారు.
మున్సిపల్ ఎన్నికలు, 2021 అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో బీజేపీ ఇప్పటి నుంచే సమాయత్తం అవుతోంది. దాదాపు ఐదు కోట్ల మంది ఓటర్లతో కనెక్టు కావాలని షా వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ‘Aar Noy Annayay’ పేరిట నినాదాన్ని ప్రజల్లోకి వెళ్లనిచ్చే విధంగా ప్రచారం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
వెస్ట్ బెంగాల్‌లో సాయంత్రం కలిఘాట్ ఆళయంలో ప్రార్థనలు చేసిన అనంతరం రాత్రి 9.50గంటలకు ఢిల్లీకి బయలుదేరనున్నారు షా. ఈ క్రమంలో న్యూ టౌన్ ప్రాంతంలోని ఓ హోటల్‌లో మరికొంతమంది నాయకులను ఆయన కలుస్తారని తెలుస్తోంది.
Read More : విషాదం : పెంపుడు కుక్కను బతికించి..ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ ఆఫీసర్