Bengal Bypolls Results : దీదీ రాక్స్..బీజేపీకి షాక్స్

  వెస్ట్ బెంగాల్‌ ఉప ఎన్నిక‌ల్లో టీఎంసీ ఘన విజయం దిశగా దూసుకెళ్తుంది. మొత్తం నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల(ఖ‌ర్దా, శాంతిపూర్‌, గొసాబ‌, దిన్‌హటా ) ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు

Bengal Bypolls Results : దీదీ రాక్స్..బీజేపీకి షాక్స్

Bengal

Updated On : November 2, 2021 / 4:18 PM IST

Bengal Bypolls Results  వెస్ట్ బెంగాల్‌ ఉప ఎన్నిక‌ల్లో టీఎంసీ ఘన విజయం దిశగా దూసుకెళ్తుంది. మొత్తం నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల(ఖ‌ర్దా, శాంతిపూర్‌, గొసాబ‌, దిన్‌హటా ) ఉప ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు విడుదలైన ఫలితాలను బట్టి చూస్తే.. గోసాబాలో 1.4లక్షల ఓట్ల మెజార్టీతో టీఎంసీ అభ్యర్థి విజయం సాధించారు. గోసాబాలో టీఎంసీకి 87శాతం ఓట్లు వచ్చాయి.

దిన్‌హటాలో టీఎంసీ అభ్యర్థి ఉదయన్ గుహ 1.6 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఖర్దా అసెంబ్లీ నియోజకవర్గంలో 93 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో టీఎంసీ అభ్యర్థి సోవన్‌దేబ్ ఛటోపాధ్యాయ్‌ విజయం సాధించారు.  కాగా,భవానీపూర్‌లో ఎమ్మెల్యేగా గెలిచి, మమత బెనర్జీ కోసం రాజీనామా చేసిన వ్యవసాయశాఖ మంత్రి సోవన్‌దేబ్ ఛటోపాధ్యాయ్‌ని ఖర్దా శాసన సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో టీఎంసీ నిలిపింది. శాంతిపూర్‌లోటీఎంసీ అభ్యర్థి ముందజలో ఉన్నారు.

అయితే  ఓట్ల లెక్కిం జరుగుతుండగానే తన పార్టీ అభ్యర్థులు విజయం సాధించినట్లు టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రకటించారు. టీఎంసీ అభ్య‌ర్ధులు భారీ మెజారిటీతో ఘ‌న విజ‌యం దిశ‌గా దూసుకుపోతుండ‌టంతో ఇది ప్ర‌జా విజ‌య‌మ‌ని మ‌మ‌తా బెన‌ర్జీ అభివ‌ర్ణించారు.

విజేతలందరికీ శుభాకాంక్షలు చెప్తూ మంగళవారం దీదీ ఓ ట్వీట్ చేశారు. విద్వేష రాజ‌కీయాలు, ప్ర‌చార హంగామాల కంటే అభివృద్ధి రాజ‌కీయాలు, ఐక్య‌త‌కే బెంగాల్ మొగ్గుచూపుతుంద‌ని వెల్ల‌డైంద‌న్నారు. త‌మ అభ్య‌ర్ధుల‌కు ప‌ట్టం క‌ట్టిన ఓట‌ర్ల‌కు దీదీ కృతజ్ఞ‌త‌లు తెలిపారు. ప్ర‌జ‌ల ఆశీస్సుల‌తో బెంగాల్ పురోభివృద్ధికి తాము పాటుప‌డ‌తామ‌ని దీదీ స్ప‌ష్టం చేశారు.

ALSO READ Huzurabad : బండి సంజయ్‌‌కు అమిత్ షా ఫోన్