దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజాస్వామ్యం లేదు

  • Published By: venkaiahnaidu ,Published On : September 23, 2019 / 01:02 PM IST
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజాస్వామ్యం లేదు

Updated On : September 23, 2019 / 1:02 PM IST

మోడీ సర్కార్ పై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలు దిగజారుతుండటంపై బీజేపీని మమతా బెనర్జీ తప్పుపట్టారు. బెంగాల్‌ లో ఇంకా ప్రజాస్వామ్యం ఉందని, అయితే దేశంలోని పలు ప్రాంతాల్లో మాత్రం ప్రజాస్వామ్యం లేదని అన్నారు. ఈనెల 19న జాదవ్‌పూర్ యూనివర్శిటీలో చోటుచేసుకున్న ఘటనలను ఆమె ప్రస్తావిస్తూ, యూనివర్శిటీలో వాళ్లు (ఏబీవీపీ, బీజేపీ) ఏం చేశారో బెంగాల్ ప్రజలంతా చూశారని అన్నారు. 

NRC పేరుతో వెస్ట్ బెంగాల్ లో బీజేపీ సృష్టించిన భయాందోళన కారణంగా 6గురు మరణించడం తనను బాధించిందని సీఎం మమతా బెనర్జీ అన్నారు. రాష్ట్రంలో ఎన్‌ఆర్‌సీకి సంబంధించిన ఎలాంటి ప్రక్రియను అనుమతించేది లేదని ఆమె అన్నారు. ఇవాళ(సెప్టెంబర్-23,2019)కోల్ కతాలో జరిగిన ట్రేడ్ యూనియన్స్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ…NRC పేరుతో బీజేపీ భయాందోళనలు సృష్టించడం సిగ్గుచేటన్నారు.

రాష్ట్రంలో ఎన్‌ఆర్‌సీకి సంబంధించిన ఎలాంటి ప్రక్రియను అనుమతించమన్నారు. తనపై నమ్మకం ఉంచాలని కోరారు. బెంగాల్‌లోనే కాదు, దేశంలో ఎక్కడా ఎన్‌ఆర్‌సీ నిర్వహించరని, అసోం ఒప్పందం ప్రకారమే ఆక్కడ ఎన్‌ఆర్‌సీ నిర్వహించారని మమత చెప్పారు.
 
బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చి అసోంలో స్థిరపడటాన్ని వ్యతిరేకిస్తూ ఆరేళ్ల పాటు సాగిన ప్రజాఉద్యమానికి తెరదించుతూ 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వానికి, ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్‌కు మధ్య అసోం ఒప్పందం జరిగింది.