ప్రధాని మోడీ భార్యకు దీదీ గిఫ్ట్: ఆప్యాయంగా పలకరించిన మమత

  • Published By: veegamteam ,Published On : September 18, 2019 / 07:15 AM IST
ప్రధాని మోడీ భార్యకు దీదీ గిఫ్ట్: ఆప్యాయంగా పలకరించిన మమత

Updated On : September 18, 2019 / 7:15 AM IST

కొన్ని సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఊహించిన వ్యక్తులు  ఎదురుపడితే ఆప్యాయంగా..ఆదరంగా పలకరింపులు గుర్తుండిపోతాయి. అవి రాజకీయ  అగ్ర నేతలకు సంబంధించినవైతే పెద్ద వార్తా మారిపోతాయి. అటువంటి ఘటనకు కోల్ కతా ఎయిర్ పోర్ట్ వేదికైంది. 

ప్రధాని మోదీని కలిసేందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీకి మంగళవారం (సెప్టెంబర్ 17) కోల్‌కతా ఎయిర్ పోర్ట్ కు వచ్చారు. అదే సమయంలో మోడీ భార్య జశోదాబెన్‌ అనుకోకుండా ఎదురయ్యారు. బెంగాల్‌లోని  పుణ్యక్షేత్రాల సందర్శించుకున్న జశోదాబెన్‌ ఝార్ఖండ్ ధన్ బాద్ కు వెళ్లేందుకు ఎయిర్ పోర్ట్ కు వచ్చారు. ఈ సమయంలో దీదీ జశోదాబెన్ ఒకరికొకరు ఎదురయ్యారు. జశోదాను చూసిన మమతా చిరునవ్వుతో..ఆప్యాయంగా పలకరించారు. మమత పలకరింపుతో జశోదా కూడా ఆమెను ప్రేమగా నవ్వుతూ పలకరించారు. అనుకోకుండా..అనుకోని వ్యక్తులు ఎదురైతే ఆ ఆనందం వేరుగా ఉంటుంది. వీరి మధ్య అటువంటి సందర్భం చోటుచేసుకుంది. 

ఈ సందర్భంగా జశోదాకు దీదీ మర్యాదపూర్వకంగా ఓ చీరను బహుమతిగా ఇచ్చారు.కాగా 18న ఢిల్లీ చేరుకున్న మమతా ప్రధాని మోడీతో సమావేశం అయ్యి పలు అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు..పశ్చిమ బెంగాల్ పేరు మార్పు వంటి పలు కీలక అంశాలపై  చర్చించనున్నారు.