Anushka Sharma: అనుష్క శర్మ ప్రశ్నకు ఆధ్యాత్మిక గురువు ఇచ్చిన ఆసక్తికర సమాధానం ఇదే..
దేవుడు మనకు అంతిమ శాంతి మార్గాన్ని చూపిస్తాడు. నా భక్తుడు ఎప్పుడూ నాశనం కాడని శ్రీ కృష్ణుడు గీతలో చెప్పాడు.

Anushka Sharma: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ గుడ్‌బై చెబుతూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇలా రిటైర్ మెంట్ ప్రకటించాడో లేదో అలా ఆధ్యాత్మిక సేవలో మునిగిపోయాడు కోహ్లి. అనుష్క శర్మ, విరాట్ దంపతులు ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్ దామ్‌ను సందర్శించారు. ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ ను కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా కోహి-అనుష్క జంటకు ఆయన ఆధ్యాత్మిక బోధనలు చేశారు. దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక గురువులలో ప్రేమానంద్ మహారాజ్ ఒకరు.
ఈ ఏడాదిలో ప్రేమానంద్ గోవింద్ శరణ్ మహారాజ్‌ని కోహ్లి దంపతులు కలవడం ఇది రెండోసారి. జనవరిలో ఒకసారి గురువును కలిశారు. ఇక 2023 జనవరిలోనూ వీరిద్దరూ మహారాజ్ ని కలిశారు. కెల్లీ కుంజ్ ఆశ్రమంలో ప్రేమానంద్ గోవింద్ శరణ్ మహారాజ్ ఆధ్యాత్మిక ప్రవచనాలను కోహ్లి దంపతులు శ్రద్ధగా విన్నారు.
ఆధ్యాత్మిక గురువుతో సంభాషణలో అనుష్క ఒక ప్రశ్న అడిగారు. “క్యా నామ్ జప్ సే హో జాయేగా?”(నామ జపం వల్ల ప్రయోజనం ఉంటుందా) అని అడిగారు. దానికి గురువు ఇలా సమాధానం ఇచ్చారు. “పూర్తిగా… నేను దీన్ని నా జీవిత అనుభవం నుండి పంచుకుంటున్నా. నేను సాంక్ యోగం, అష్టాంగ యోగం, కర్మ యోగాలను అనుభవించిన తర్వాత భక్తి యోగానికి వచ్చాను” అని ఆధ్యాత్మికు గురువు బదులిచ్చారు.
Also Read: వార్నీ.. అన్ని నెలలు ఆగాలా.. కోహ్లీ, రోహిత్ లను టీమ్ఇండియా జెర్సీలో చూసేందుకు..
”సాంక్ యోగం, అష్టాంగ యోగం, కర్మ యోగాలను అనుభవించిన తర్వాత భక్తి యోగానికి వచ్చాను. ఇది నా వ్యక్తిగత అనుభవం. వ్యక్తి ఆలోచనలో మార్పు వచ్చినప్పుడు దైవ కృప ఉంటుంది. తన భక్తులకు అంతిమ శాంతికి మార్గాన్ని చూపే వాడు ప్రభువు. ఒకరి కీర్తి, కీర్తి పెరుగుదల దేవుని దయగా పరిగణించబడదు అనేది నిజం. ఒక వ్యక్తిలో ఆలోచనలో మార్పు వచ్చినప్పుడు ఆ దేవుడి దయ ఉంటుంది. దేవుడు మనకు అంతిమ శాంతి మార్గాన్ని చూపిస్తాడు. నా భక్తుడు ఎప్పుడూ నాశనం కాడని శ్రీ కృష్ణుడు గీతలో చెప్పాడు. ఆనందంతో దేవుని నామాన్ని జపించండి” అని అనుష్క శర్మ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు గురూజీ.
”ఈ వైభవాన్ని పొందడం ఒక వరం కాదు, అదొక పుణ్యం. అంతర్గత ఆలోచనలను మార్చడం దేవుని పనిగా పరిగణించబడుతుంది. అది మీరు జీవిస్తున్న విధానం లానే ఉండాలి, పూర్తిగా ప్రాపంచికంగా ఉండాలి. కానీ మీ అంతర్గత ఆలోచనలు మారాలి. దానిలో కీర్తి భావన ఉండకూడదు. మీ అంతర్గత ఆలోచన ఇలా ఉండాలి ‘దేవా, చాలా జీవితాలు గడిచిపోయాయి, ఇప్పుడు నాకు నువ్వు కావాలి’. (శ్రేయస్సు అనేది కేవలం దేవుని దయ కాదు – అది సద్గుణం (పుణ్యం) ఫలితం.
ఇది దైవికం వైపు ఒక ఉద్యమంగా పరిగణించబడుతుంది. నిజంగా ముఖ్యమైనది మీ అంతరంగం పరివర్తన. మీరిప్పుడు జీవిస్తున్నట్లుగా జీవించండి, ప్రపంచంలో పూర్తిగా నిమగ్నమై ఉండండి, కానీ మీ అంతరంగం మారనివ్వండి. లోపల గుర్తింపు లేదా కీర్తి కోసం కోరిక ఉండకూడదు. మీ అంతర్గత ఆలోచనలు ఇలా ఉండాలి.. ‘ప్రభూ, అన్ని ప్రాపంచిక అనుభవాలు చాలు, ఇప్పుడు, నేను నిన్ను మాత్రమే కోరుకుంటున్నాను” అని వివరించారు ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ గోవింద్ శరణ్ మహారాజ్.
Virat Kohli & Anushka Sharma से पूज्य महाराज जी की क्या वार्तालाप हुई ? Bhajan Marg pic.twitter.com/7IWWjIfJHB
— Bhajan Marg (@RadhaKeliKunj) May 13, 2025
”తొలుత నేను సన్యాసిగా ఉన్నా. 20 ఏళ్లు సన్యాసిగా ఉన్నా. కాశీ విశ్వనాధ్ జీ దగ్గర సన్యాసిగా ఉన్నా. సాంఖ్య, అష్టాంగ, కర్మ యోగం.. ఈ మూడింటిని బాగా అర్థం చేసుకున్నాకే భక్తి యోగంలోకి వచ్చాను. దేవుడిని మించిన జ్ఞాని ఎవరూ లేరు. రాధా రాధా రాధా అని జపం చేస్తాం. అన్నీ అనుభవంతో చెబుతున్నా. రాధా రాధా అని జపం చేస్తే ఈ జన్మలోనే దేవుడి ప్రాప్తి కలుగుతుంది. రాధా రాధా రాధా అనే నామం జపిస్తే ఈ జన్మలోనే దైవ ప్రాప్తి సిద్ధిస్తుంది. ఆఖరి శ్వాస వరకు రాధా అని నామ జపం చేయగలిగితే.. నేను చెప్పినదాంటో ఎలాంటి సందేహం, అనుమానం లేదు. మీ మనసులో నిత్యం జపం చేయండి. ఎక్కువసార్లు నామ జపం చేయాలని నేను చెప్పడం లేదు. తక్కువ సార్లు చేసినా.. మనసు పెట్టి చేయాలి. అలా చేయడం వల్ల దక్కే ఫలితం అద్భుతం. రోజులో ఏదో ఒక సమయంలో ఈ నామ జపం చేయడం అలవాటుగా చేసుకోవాలి. ఆ తర్వాత జరిగే అద్భుతాలు మీరే చూస్తారు” అని ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ గోవింద్ శరణ్ మహారాజ్.. విరాట్, అనుష్క దంపతులకు ఆధ్యాత్మిక బోధన చేశారు.