వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్
ప్రముఖ మేసేజింగ్ యాప్ వాట్సాప్.. త్వరలో పేమెంట్ సర్వీసులు కూడా స్టార్ట్ చేయనుంది. మరో 2 నెలల్లో భారత్ లో ఆన్ లైన్ పేమెంట్ సర్వీసులను ప్రారంభించనుంది. ఏడాది

ప్రముఖ మేసేజింగ్ యాప్ వాట్సాప్.. త్వరలో పేమెంట్ సర్వీసులు కూడా స్టార్ట్ చేయనుంది. మరో 2 నెలల్లో భారత్ లో ఆన్ లైన్ పేమెంట్ సర్వీసులను ప్రారంభించనుంది. ఏడాది
ప్రముఖ మేసేజింగ్ యాప్ వాట్సాప్.. త్వరలో పేమెంట్ సర్వీసులను పూర్తి స్థాయిలో స్టార్ట్ చేయనుంది. మరో 2 నెలల్లో భారత్ లో ఆన్ లైన్ పేమెంట్ సర్వీసులను అందుబాటులోకి తేనుంది. ఏడాది కాలంగా కొంతమంది యూజర్స్ కు ప్రయోగాత్మకంగా ఆన్ లైన్ పేమెంట్స్ సర్వీసులను అందిస్తున్న వాట్సాప్.. త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది. వాట్సాప్ లో పేమెంట్స్ సర్వీస్ అందుబాటులోకి వస్తే 30 కోట్ల మంది యూజర్లు లబ్ధి పొందుతారని వాట్సాప్ నిర్వాహకులు తెలిపారు. వాట్సప్ పేమెంట్ సర్వీసెస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వాట్సాప్.. ఫేస్‌బుక్ అధీనంలో ఉంది. త్వరలోనే డేటా లోకలైజేషన్ నిబంధనలను నెరవేర్చనుంది. ఆ తర్వాత పేమెంట్ సర్వీసులను ప్రారంభించడం వాట్సప్‌కు వీలవుతుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. భారత్ లో 2018 నుంచే వాట్సప్ పేమెంట్ సర్వీసెస్ బీటా వెర్షన్‌ను నడుపుతోంది. చైనాలో వుయ్‌ఛాట్ తరహాలో.. భారత్ లో డిజిటల్ చెల్లింపులకు డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు. డేటా లోకలైజేషన్ కారణంగా గూగుల్, వాట్సప్ పేమెంట్ సర్వీసులు పెండింగ్‌లో ఉన్నాయి. రాబోయే 2 నెలల్లో పేమెంట్ సర్వీసెస్ లాంచ్ కు సిద్ధమవుతుందన్నారు.
వాట్సప్ తన పేమెంట్ సర్వీసెస్‌ను ప్రస్తుతం 10లక్షల మందికే పరిమితం చేసింది. ఆర్‌బీఐ డేటా లోకలైజేషన్ నిబంధనలను పూర్తిగా నెరవేర్చకపోవడం వల్లే ఈ పరిమితి పాటించాల్సి వస్తోంది. ఆడిటర్ల పరిశీలన పూర్తయ్యాక రివ్యూ చేసి ముందుకెళ్తారు. భారత్ లోని యూజర్ల ట్రాన్సాక్షన్, డేటాను ఇక్కడే ఉంచాలని.. విదేశీ సర్వర్ల నుంచి 24 గంటలలోపు తొలగించాలని విదేశీ కంపెనీలకు ఆర్‌బీఐ రూల్స్ పెట్టింది. వాట్సప్ డేటా లోకలైజేషన్ కంప్లయన్స్ మీద ఆర్‌బీఐ నియమించిన థర్డ్ పార్టీ సంస్థ ఆడిట్ జరుపుతోంది. అది పూర్తయ్యాక రివ్యూ చేసి వాట్సప్ ముందుకు వెళ్లడానికి అనుమతిస్తారు. మన దేశంలో ప్రస్తుతం 10 కోట్ల మంది డిజిటల్ పేమెంట్ యూజర్లున్నారు. పేమెంట్స్ నగదు రహితంగా మారాలంటే ఈ సంఖ్య కనీసం 30 కోట్లకు పెరగాలని అధికారులు చెప్పారు.