Cyclones : దేశంలో ఏ రాష్ట్రానికి తుపానుల ముప్పు ఎక్కువ..అక్కడి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలుసా?

Cyclones దేశంలో ఏ రాష్ట్రంకు తుపానుల ముప్పు ఎక్కువగా ఉంటుంది.. ఆ రాష్ట్ర ప్రభుత్వం తుపానులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు ..

Cyclones : దేశంలో ఏ రాష్ట్రానికి తుపానుల ముప్పు ఎక్కువ..అక్కడి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలుసా?

Cyclones

Updated On : October 29, 2025 / 8:57 AM IST

Cyclones : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘మొంథా’ తీరం దాటింది. మంగళవారం అర్ధరాత్రి 11.30 నుంచి 12:30 గంటల సమయంలో మచిలీపట్నం – కళింగపట్నం మధ్య, కాకినాడకు దక్షిణంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి సమీపంలో తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎంఏ) ప్రకటించింది. తుపాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలతోపాటు.. భీకర ఈదురుగాలులు వీచాయి.

తుపానును సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం మూడు రోజుల ముందు నుంచే ప్రత్యేక చర్యలు చేపట్టింది. అయితే, దేశంలో ఏ రాష్ట్రంకు తుపానుల ముప్పు ఎక్కువగా ఉంటుంది.. ఆ రాష్ట్ర ప్రభుత్వం తుపానులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలుసుకుందాం.

Also Read: Cyclone Montha : షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన మొంథా తుపాను.. అంచనాలు తారుమారు.. ఏపీలోని ఈ జిల్లాల్లో నేడు అతిభారీ వర్షాలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

భారత ఉపఖండంలో ఏర్పడే చాలా తుపానులు సాధారణంగా బంగాళాఖాతంలోనే పుట్టుకొస్తాయి. గత ఐదు సంవత్సరాల కాలంలో ఈ సముద్రంలో మొత్తం 12 తుపానులు ఉద్భవించాయి. వీటిలో ఎక్కువ శాతం తీవ్రమైనవే. 1891 నుండి 2019 వరకు బంగాళాఖాతంలో మొత్తం 522 తుపాన్లు ఏర్పడ్డాయి. అంటే సగటున ప్రతి సంవత్సరం రెండు నుండి మూడు తుపాన్లు ఈ సముద్రంలో పడతాయి. బంగాళాఖాతంలోనే ఎక్కువగా తుపాన్లు ఉద్భవించడానికి అనేక కారణాలు ఉన్నాయి.

బంగాళాఖాతంలో నీరు వేడిగా ఉంటుంది. ఇది తుపాను ఏర్పాటుకు అవసరమైన శక్తిని అందిస్తుంది. వాతావరణ నిపుణుల ప్రకారం వేడిగా ఉన్న సముద్ర ప్రాంతాలు తుపానుల పుట్టుకకు ఎక్కువ అనుకూలంగా ఉంటాయి. అరేబియా సముద్రం తూర్పుతీరం కంటే చల్లగా ఉండడంతో.. అక్కడ తుపానులు పెద్దగా ఉద్భవించవు.

దేశంలో తుపానును ఎదుర్కొనే రాష్ట్రం ఏది అంటే ఒడిశా అని చెప్పేయొచ్చు. ఎందుకంటే ఆ రాష్ట్రంకు ఎప్పుడూ తుపాన్లు ముప్పు పొంచిఉంటుంది. గత రికార్డుల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం మొత్తం తుపానుల్లో 48శాతం తుపానులను ఎదుర్కొంటుంది. ఆ తరువాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఏపీ 22శాతం, పశ్చిమ బెంగాల్ 18.5శాతం, తమిళనాడు 11.5శాతం వాటా కలిగి ఉన్నాయి. తుపానుల ముప్పు ఒడిశాకు ఎక్కువగా ఉండటంతో ఆ రాష్ట్రం తుపాన్లను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు శాశ్వత చర్యలను చేపట్టింది.

బలమైన తుపానులను కూడా ఒడిశా పకడ్బందీగా ఎదుర్కొటుంది. తద్వారా చాలా వరకు ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారిస్తుంది. గత 27ఏళ్లలో ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి ఒడిశా అనేక చర్యలను చేపట్టింది. వందలాది తుపాను సహాయక శిబిరాలను నిర్మించింది. తుపాను సమయంలో లక్ష మందికిపైగా బాధితులకు ఆవాసం కల్పించేందుకు వేలాది ప్రత్యేక కేంద్రాలను ఆ ప్రభుత్వం నిర్మించింది. తీర ప్రాంతాల్లో 122 సైరన్ టవర్లతో పాటు తుపాను హెచ్చరికలకు సంబంధించిన పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేసింది. తుపాను సమయంలో వచ్చే బలమైన ఈదురుగాలులను తట్టుకునేలా తీర ప్రాంతంలో ఇళ్ల గోడలు, పైకప్పులను పటిష్ఠ పర్చారు.

17 జిల్లాలకు పైగా ‘లొకేషన్ బేస్డ్ అలారం వ్యవస్థ’ను ఏర్పాటు చేశారు. వీటి సాయంతో ప్రజలకు తుపాను ప్రభావానికి సంబంధించిన సమాచారంతో పాటు రక్షణ చర్యలకు సంబంధించిన వివరాలను అందిస్తారు. మత్స్యకారుల కోసం ప్రత్యేక వార్నింగ్ వ్యవస్థను ఓడిశా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంతేకాదు.. సామాజిక మాధ్యమాల సాయంతో ఎప్పటికప్పుడు వాతావరణంపై హెచ్చరికలు జారీ చేస్తుంది.