Bengal village: అఫ్ఘానిస్తాన్‌లో పరిస్థితులతో భారత్‌లోని ఓ ప్రాంతంలో ప్రజలకు నిద్రపట్టట్లేదు
బెంగాల్‌లోని బంకుడా జిల్లాలోని పట్టణం సోనాముఖిలో నివసించే కొన్ని కుటుంబాలు అఫ్ఘానిస్తాన్‌లో పరిస్థితులపై ఆందోళన చెందుతున్నాయి.

Afghan
Bengal village: కాబూల్ నుంచి మూడు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగాల్‌లోని బంకుడా జిల్లాలోని పట్టణం సోనాముఖిలో నివసించే కొన్ని కుటుంబాలు అఫ్ఘానిస్తాన్‌లో పరిస్థితులపై ఆందోళన చెందుతున్నాయి. అఫ్ఘానిస్తాన్‌లో జరుగుతున్న సంఘటనలను సాధారణ స్థాయి కంటే ఎక్కువ ఆసక్తితో చూస్తున్నారు. సోనాముఖిలో జీవనం సాగించే సగం కంటే ఎక్కువ మంది 40ఏళ్ల నుంచి, కాబూలివాల్స్‌కు రంగురంగుల తలపాగాలను సరఫరా చేస్తున్నారు.
కొంతమంది టర్బన్ తయారీదారులను దెబ్బతీసేట్లుగా ఉన్న ఈ పరిస్థితిపై స్థానిక నేత కార్మికుల సంస్థ ప్రతినిధి శ్యాంపాద్ దత్తా ఆదివారం మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్తాన్‌లో సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి సోనాముఖి పట్టణంలో సుమారు 150 తలపాగా తయారీదారులు భారీ నష్టాలను ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని, ఎందుకంటే తమ టర్బన్‌లను అఫ్ఘానిస్తాన్‌కు పంపిన ఒక సూరత్ ఆధారిత ఏజెన్సీ చేసే పని ఆగిపోయిందని, సోనాముఖి నగరం పట్టు నేయడానికి ప్రసిద్ధి కాగా.. వాటిని ఎగుమతి చేసే అవకాశం లేనప్పుడు ఇబ్బందులు తప్పవని అన్నారు.
లాక్‌డౌన్ కారణంగా ఇప్పటికే వ్యాపారాలు తీవ్రంగా నష్టపోయిన స్థానిక నేత కార్మికులు ఇప్పుడు మరింత ఇబ్బందుల్లో పడిపోయినట్లు చెబుతున్నారు. సోనాముఖి దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం కృష్ణబజార్‌కు సుగంధ ద్రవ్యాలు, డ్రై ఫ్రూట్స్ మొదలైన వాటిని విక్రయించడానికి తలపాగా తయారీకి కేంద్రంగా మారింది. ఇక్కడ నివసించేవారిని కాబూలీవాలాలు అని కూడా అంటారు.
లాక్ డౌన్ తర్వాత ఈ వ్యాపారం అభివృద్ధి చెందడం ప్రారంభం అవ్వగా.. దాదాపు 150 మంది నేత కార్మికులు ఈ పనిలోనే ఉంటారు. ఒక తలపాగా తయారీ ఖర్చు రూ .350 నుంచి 3,500 వరకు ఉంటుంది. ఇప్పుడు అసలు కొనే పరిస్థితే లేకపోవడంతో నేత కార్మికులు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు. టర్బన్ మేకర్ సాధారణంగా ఒక నెలలో 20-50 టర్బన్‌లను తయారు చేస్తారు. కోల్‌కతాకు నేత కార్మికుల నుంచి వస్తువులు పంపే వ్యాపారవేత్త నిమాయ్ పాల్, నష్టాన్ని అంచనా వేయడం కష్టమని, నష్టం కోట్లలో ఉండొచ్చని అంటున్నారు.
1990 లలో ఈ ప్రాంతంలో దాదాపు 500 కుటుంబాలు తలపాగా వ్యాపారం చేసేవి. అయితే డిజిటల్ ప్రింటింగ్ మరియు ఆధునిక హంగులు అందుబాటులోకి వచ్చిన తర్వాత అఫ్ఘానిస్తాన్‌లో పెద్ద సంఖ్యలో టర్బన్‌లను విస్మరించడం వల్ల ఆ సంఖ్య ఇప్పుడు 150 కి తగ్గిపోయింది.