నా దేశంలో నాకు రక్షణ లేదు..పార్లమెంట్ బయట అమ్మాయి ఆందోళన

దేశంలో మహిళలకు రోజురోజుకి రక్షణ కరువైపోతుందంటూ అను దూబే అనే ఓ టీనేజ్ యువతి పార్లమెంట్ బయట ఆందోళన చేపట్టింది. నేను నా సొంత దేశంలో సేఫ్ గా ఉన్నానని ఫీల్ అవడం లేదు ఎంటుకూ అని ప్రశ్నిస్తూ ఓ ప్లకార్డ్ పట్టుకుని ఢిల్లీలోని పార్లమెంట్ బయట నిరసన కార్యక్రమం చేపట్టింది.
అయితే కొద్దిసేపటికే అక్కడికి చేరుకున్న పోలీసులు అను దూబేను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ జీపు ఎక్కించి తనను అక్కడి నుంచి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఢిల్లీ మహిళా కమిషన్ బృందం పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. కొద్ది సేపటికే పోలీసులు అను దూబునే విడుదల చేశారు.
రెండు రోజుల క్రితం హైదరాబాద్ శివార్లలో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డిని నాలుగు మానవ మృగాలు అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ప్రియాంకరెడ్డి హత్య జరిగిన కొన్ని గంటల్లోనే హైదరాబాద్ లో మరో యువతి కూడా అలాగే బలైపోయింది.
జార్ఖండ్ రాజధాని రాంచీలో కూడా ఓ లా స్టూడెంట్ ని కొందరు యువకులు ఆయుధాలు చూపించి ఎత్తుకెళ్లి రేప్ చేసి చంపేశారు. ఈ విధంగా దేశంలో దేశంలో మహిళపై జరుగుతున్న దాడులు,నేరాలను వార్తల్లో చూసి కలత చెందిన అను దూబే ఇవాళ పార్లమెంట్ బయట దేశంలో మహిళలకు రక్షణ కరువైందంటూ ఆందోళనకు దిగింది.