నెస్లేకు మళ్లీ షాక్ : పిల్లలు మ్యాగీనే ఎందుకు తినాలి?
నెస్లే ఇండియాకు మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. లక్షలాది మంది పిల్లలు, పెద్దలు ఇష్టంగా తినే మ్యాగీ నూడుల్స్‌లో ప్రాణాంతకమైన విషం (సీసం) ఉందని స్పష్టమైంది.

నెస్లే ఇండియాకు మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. లక్షలాది మంది పిల్లలు, పెద్దలు ఇష్టంగా తినే మ్యాగీ నూడుల్స్‌లో ప్రాణాంతకమైన విషం (సీసం) ఉందని స్పష్టమైంది.
నెస్లే ఇండియాకు మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. లక్షలాది మంది పిల్లలు, పెద్దలు ఇష్టంగా తినే మ్యాగీ నూడుల్స్‌లో ప్రాణాంతకమైన విషం (సీసం) ఉందని స్పష్టమైంది. మ్యాగీ తయారీ సంస్థ ‘నెస్లే ఇండియా’పై దాఖలైన పిటిషన్ పై విచారించిన సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధన సంస్థ (సీఎఫ్‌టీఆర్‌ఐ) పరిశోధనలోనూ సీసం ఉందని తేలింది. మ్యాగీలో ప్రాణాంతక సీసం ఉందని ఆరోపిస్తూ ‘నెస్లే ఇండియా’ సంస్థకు రూ.640 కోట్ల జరిమానా విధించాలంటూ కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ 2015లో ఎన్‌సీడీఆర్‌సీ ఎదుట పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై 2015 డిసెంబరులో స్టే విధించిన సుప్రీంకోర్టు మ్యాగీ నూడుల్స్‌ను పరిశోధించాలని సీఎఫ్‌టీఆర్‌ఐను ఆదేశించింది. నూడుల్స్‌లో సీసం ఉందన్న సీఎఫ్‌టీర్‌ఐ తాజా నివేదిక వెల్లడించింది.
ఆ మ్యాగీని పిల్లలు ఎందుకు తినాలని నెస్లే తరఫు న్యాయవాది అభిషేక్ మనూ సింఘ్వీని జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నించారు. సీసం అనుమతించిన పరిమితిలోనే ఉందని సమాధానమిచ్చిన సింఘ్వీ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లు ప్రాణాంతక మోనోసోడియం గ్లుటమేట్ (ఎంఎస్‌జీ) లేదని చెప్పారు. వాదనలు విన్న జస్టిస్ డీవీ చంద్రచూడ్, హేమంత్ గుప్తాలతో కూడిన ధర్మాసనం ఎన్‌సీడీఆర్‌సీలో కేంద్రం వేసిన పిటిషన్ పై విచారణకు అనుమతించింది. సుప్రీం కోర్టు ఆదేశాలను నెస్లే స్వాగతించింది. మ్యాగీ నూడుల్స్‌లో సీసం తదితర అవశేషాలు నిర్దేశిత స్థాయిల్లోనే ఉన్నాయని సీఎఫ్‌టీఆర్‌ఐ పరీక్షల్లో తేలినట్లు పేర్కొంది.