గాంధీ హత్య కేసు రీ ఓపెన్ చేయాలి

  • Published By: madhu ,Published On : February 16, 2020 / 08:39 PM IST
గాంధీ హత్య కేసు రీ ఓపెన్ చేయాలి

Updated On : February 16, 2020 / 8:39 PM IST

జాతిపిత మహాత్మాగాంధీ హత్య కేసును రీ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి. రీ ఓపెన్ చేసి..పునర్ విచారించాలని కోరారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ల ద్వారా ప్రశ్నలు సంధించారు. ఆయన డెడ్ బాడీకి ఎందుకు పోస్టుమార్టం నిర్వహించలేదు ? అభా, మనులను కోర్టులో ఎందుకు విచారించలేదు ? గాడ్సే కాల్చిన రివాల్వర్‌ ఎందుకు పట్టుకోలేకపోయారు ? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 

ఆ రోజు సాయంత్రం 5.05 గంటలకు నాలుగు బుల్లెట్ శబ్దాలు విన్నాడని అసోసియేటెడ్ ప్రెస్ ఇంటర్నేషనల్ జర్నోను ప్రస్తావిస్తూ చెప్పారు. అయితే..గాడ్సే మాత్రం రెండుసార్లు మాత్రమే కాల్చాడని చెప్పారని గుర్తు చేశారు. గాంధీ 5.40 గంటలకు చనిపోయాడని చెప్పాడని..అంటే..35 నిమిషాల పాటు ఆయన బతికే ఉన్నారని తెలిపారు. గతంలో కూడా గాంధీ హత్య కేసును పునర్ విచారించాలనే డిమాండ్స్ వినిపించాయి.

దీనిపై 2017 అక్టోబర్‌లో ఐటీ ప్రోఫెషనల్ డా.పంకజ్ కుముద్ చంద్ర ఫడ్నీస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గాంధీ హత్య కేసును పునర్ విచారించాలని కోరారు. గాడ్సే, దత్తాత్రేయ ఆప్టేలను 1949, నవంబర్ 15వ తేదీన ఉరితీశారన్నారు. అప్పట్లో సుప్రీంకోర్టు లేదనే విషయాన్ని ఆయన వెల్లడించారు. తాజాగా..సుబ్రమణియన్ స్వామి చేసిన డిమాండ్స్‌పై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.