మార్కెట్లో కొత్త ట్రెండ్.. కలియుగపు ఫ్యాషన్.. ఇలాంటి బట్టలు ధరించొద్దంటూ ప్రేమానంద్ మహారాజ్ వార్నింగ్
ప్రస్తుతం మార్కెట్లో హిందూ గ్రంథాల శ్లోకాలతో కూడిన దుస్తులు విపరీతంగా కనపడుతున్నాయి.

Premanand Maharaj
“ఓం” వంటి హిందూ మంత్రాలతో డిజైన్ చేసిన దుస్తులను వేసుకుంటున్న యువతకు ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ వార్నింగ్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో వృందావన్ వేదికగా ఆధ్యాత్మిక అంశాలు బోధించే ప్రేమానంద్ మహారాజ్ తాజాగా ఈ కొత్త ట్రెండ్‌పై పలు వ్యాఖ్యలు చేశారు.
ఇటువంటి మంత్రాలను దుస్తులపై వాడడం సరికాదని, ఈ తీరుకు ముగింపు పలకాలని చెప్పారు. వేద మంత్రాలు భక్తితో చదవాలని, అవి ఉండాల్సింది దుస్తులపై కాదని, గుండెల్లో ఉండాలని అన్నారు. ప్రస్తుతం మార్కెట్లో హిందూ గ్రంథాల శ్లోకాలతో కూడిన దుస్తులు విపరీతంగా కనపడుతున్నాయి.
బట్టలపై మంత్రాలు ఉండడం ఫ్యాషన్ ట్రెండ్‌గా మారాయి. అనేక దుస్తుల బ్రాండ్‌లు, ఆన్‌లైన్ స్టోర్‌లు వేదాలు, పురాణాల నుంచి మంత్రాలతో ముద్రించిన కుర్తాలు, టీ షర్టుల వంటి దుస్తులను విక్రయిస్తున్నాయి.
ఇటీవల ఒక యువకుడు శివుడి మంత్రం ముద్రించిన కుర్తాను ధరించి రావడంతో ప్రేమానంద్ మహారాజ్ అతడిని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ప్రేమానంద్ మహారాజ్ ఇలా స్పందించారు.
“మా ప్రార్థన ఏమిటంటే.. ఇలాంటి వస్త్రాలు ధరించకండి. ఎందుకంటే వాటిపై మంత్రాన్ని రాశారు. ఇది సరైన పద్ధతి కాదు. కలియుగంలో చాలామంది ఇలాంటివి ఫ్యాషన్‌ను ప్రారంభించారు, కానీ ఇటువంటి వాటిని నిషేధించాల్సిందే. ఆ దుస్తులపై వైదిక మంత్రం ఉంది. ఇది మన హృదయంలో ఉండాలి.. కానీ, వస్త్రంపై కాదు. ఈ మంత్రం గురువు ద్వారా తెలుసుకుని మనస్సులో జపించాలి” అని తెలిపారు.
View this post on Instagram