Covid Vaccine కోసం రూ.80వేల కోట్లు ఉన్నాయా!

Covid Vaccine కోసం రూ.80వేల కోట్లు ఉన్నాయా!

Updated On : September 26, 2020 / 9:34 PM IST

మహమ్మారి కరోనా విజృంభణను అదుపుచేసేందుకు ప్రపంచమంతా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తుంది. ఇప్పటికే విదేశీ కంపెనీలు కనిపెట్టేశామని చెప్పేయగా ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టలేదు. దేశీయ కంపెనీలు కూడా చివరిదశకు చేరుకున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో స్పుత్నిక్‌-వీ పేరిట​ కరోనా వ్యాక్సిన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయగా, ఆస్ట్రాజెనెకా, మోడర్నా తదితర కంపెనీల వ్యాక్సిన్లు మూడో దశ క్లినికల్‌ పరీక్షలకు చేరుకున్నాయి. .

అన్నీ సజావుగా సాగితే ఈ ఏడాది చివర్లోగా టీకా విడుదల గురించి ఒక స్పష్టమైన అవగాహన వచ్చే అవకాశం ఉంది. ఆదార్ పూనావాలా కొత్త డౌట్ ఎత్తి చూపారు. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ ఆదార్ పూనావాలా కొవిడ్ వ్యాక్సిన్ అప్‌డేట్ ఇచ్చిన పూనావాలా కీలక వ్యాఖ్యలు చేశారు.

‘వచ్చే ఏడాదికి గానూ రూ.80 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకు ఇండియన్ గవర్నమెంట్ సిద్ధంగా ఉందా? ఎందుకంటే, వాక్సిన్‌ కొనుగోలు చేసేందుకు, దేశంలోని ప్రతీ వ్యక్తికి దానిని అందించేందుకు ఆరోగ్య శాఖ ఈ మొత్తం అవసరం పడుతుంది. మనం తర్వాత ఎదుర్కోబోయే అతిపెద్ద సవాలు ఇదే’అని ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

దేశీయ, విదేశీ ఫార్మా కంపెనీలను సంప్రదించి టీకాను కొనుగోలు చేసే అంశంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకతను వివరించేందుకే తాను ఈ ప్రశ్న అడిగినట్లు పూణావాల పేర్కొన్నారు.