Farm laws repeal : సాగు చట్టాలను మళ్లీ తెస్తాం.. నరేంద్ర సింగ్ తోమర్ సంచలన వ్యాఖ్యలు

తాము వ్యవసాయ చట్టాలను తీసుకొస్తే..కొంతమందికి నచ్చలేదని, కానీ..ప్రభుత్వం నిరాశ మాత్రం చెందలేదన్నారు. రైతులు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుదన్న ఆయన..

Farm laws repeal : సాగు చట్టాలను మళ్లీ తెస్తాం.. నరేంద్ర సింగ్ తోమర్ సంచలన వ్యాఖ్యలు

Far

Updated On : December 25, 2021 / 3:25 PM IST

Agriculture Minister Tomar Comments : మళ్లీ తేనెతుట్టను కదిపారు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. సాగు చట్టాలను రద్దు చేయాలంటూ..ఎన్నో రోజులుగా రైతులు చేసిన ఆందోళనకు కేంద్రం దిగి వచ్చి..ఆ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వల్పమార్పులతో ఈ చట్టాలను మళ్లీ తీసుకొస్తామన్నారు. ఒక్క అడుగు వెనక్కి వేశాం..మళ్లీ ముందడుగు వేస్తామని..రైతులు దేశానికి వెన్నెముక అంటూనే ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది.

Read More : Teenmar mallanna : తీన్మార్ మల్లన్నపై బంజారా‌హిల్స్ పోలీసు‌స్టేషన్‌లో ఫిర్యాదు

2021, డిసెంబర్ 25వ తేదీ శనివారం ఆయన మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తాము వ్యవసాయ చట్టాలను తీసుకొస్తే..కొంతమందికి నచ్చలేదని, కానీ..ప్రభుత్వం నిరాశ మాత్రం చెందలేదన్నారు. రైతులు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుదన్న ఆయన..రైతులకు ఉపయోగపడే చట్టాలను తీసుకొస్తామన్నారు. 70 ఏళ్లలో ఎవరూ చేయని సంస్కరణలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేశారన్నారు.

Read More : AAP TELANGANA : ఆమ్ ఆద్మీ పార్టీలోకి ఇందిరా శోభన్

జూన్‌ 5, 2020 వ్యవసాయ చట్టాల రూపకల్పన జరిగినప్పటి నుంచి న్యాయం చేయాలంటూ అన్నం పెట్టే అన్నదాత న్యాయం కోసం రోడ్డెక్కాడు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని పట్టు విడవకుండా ఉక్కు సంకల్పంతో ఆందోళన చేశారు. ఎముకల కొలికే చలిని సైతం లెక్కజేయలేదు. ట్రాక్టర్లనే తాత్కాలిక నివాసాలు చేసుకొని.. రోడ్లపైనే భోజనాలు చేశారు. 15 నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లోనే బైఠాయించి రైతు సంఘాలు కదం తొక్కాయి.. రోజుకో తీరుగా తమ పోరాటాన్ని కొనసాగించారు.. దీంతో కేంద్రం ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. అన్నదాత ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. గురునానక్ జయంతి సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.. రైతులను ఒప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేసినా… రైతులను సంతృప్తి పరచలేకపోయామని అందుకే వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తునట్లు వెల్లడించారు. మరి..ప్రస్తుతం కేంద్ర మంత్రి తోమర్ చేసిన వ్యాఖ్యలు ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.