ఒకే కాన్పులో నలుగురుకి జన్మనిచ్చిన మహిళ

  • Published By: venkaiahnaidu ,Published On : February 9, 2020 / 12:20 AM IST
ఒకే కాన్పులో నలుగురుకి జన్మనిచ్చిన మహిళ

Updated On : February 9, 2020 / 12:20 AM IST

ఒకే కాన్సులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది ఓ మహిళ. ఫిబ్రవరి-8,2020న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుషికేష్ లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఈ అరుదైన సంఘటన జరిగింది. గైనకాలజీ,నియోనటాలజీ డిపార్ట్మెంట్స్ హెడ్ ల నేతృత్వంలో డాక్టర్ల బృందం అత్యంత రిస్క్ ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించారని ఎయిమ్స్ డైరక్టర్ రవికాంత్ తెలిపారు.

నలుగరు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ ఉత్తరకాశీకి చెందినదని,ఫిబ్రవరి-2,2020న ఎయిమ్స్ లో చేరిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం తల్లి,నలుగురు బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని ఆయన తెలిపారు.