Alcoholic Drink: పబ్‌కెళ్లి ఆల్కహాల్ ఆర్డర్ ఇచ్చిన యువతి.. మొహం కాల్చారు!!

బెంగళూరులోని ఓ పబ్‌లో యువతికి చేదు అనుభవం ఎదురైంది. ఆ ఘటనతో మొహమంతా కాలిన గాయాలయ్యాయి. ఫలితంగా నష్టపరిహారం కింద ఆ ప్రభుత్వం రూ.74వేలు చెల్లించింది పబ్ మేనేజ్మెంట్.

Alcoholic Drink: పబ్‌కెళ్లి ఆల్కహాల్ ఆర్డర్ ఇచ్చిన యువతి.. మొహం కాల్చారు!!

New Project

Updated On : October 27, 2021 / 3:21 PM IST

Alcoholic Drink: బెంగళూరులోని ఓ పబ్‌లో యువతికి చేదు అనుభవం ఎదురైంది. ఆ ఘటనతో మొహమంతా కాలిన గాయాలయ్యాయి. ఫలితంగా నష్టపరిహారం కింద ఆ ప్రభుత్వం రూ.74వేలు చెల్లించింది పబ్ మేనేజ్మెంట్. రెసిడెన్సీ రోడ్ లోని పబ్ కమ్ డిన్నర్ ఓ పబ్ కు వెళ్లి ముగ్గురు స్నేహితులతో కలిసి షాట్స్ ఆర్డర్ ఇచ్చింది.

ఫ్లేమ్ బేస్డ్ డ్రింక్ అయిన సాంబుకా షాట్స్ (Sambuka Shots)ను ఆర్డర్ ఇవ్వమని.. బాగుంటుందని సూచించడంతో యువతి అదే పని చేసింది. బాధితురాలి కథనం ప్రకారం.. డ్రింక్ ను నేరుగా గొంతులోకి పోసేశాడట.

దాంతో మహిళ గొంతులో మంటలు వంటివి రావడంతో స్నేహితులు, పబ్ స్టాఫర్ సాయంతో వెంటనే హాస్పిటల్ కు తరలించారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసిన అనంతరం యువతి బెంగళూరు కన్జూమర్ కోర్టులో కంప్లైంట్ చేసింది.

………………………………………… : రెచ్చిపోయి సోకులారబోస్తున్న ‘రొమాంటిక్’ పాప

తన ఆరోగ్యం దెబ్బతినడానికి పబ్ స్టాఫర్ నిర్లక్ష్యమే కారణమని కంప్లైంట్ లో పేర్కొంది. మెడికల్ రికార్డులు, ట్రీట్మెంట్ డిటైల్స్ తో కలిపి మొత్తం డాక్యుమెంట్లను మహిళ తరపు న్యాయవాది కోర్టులో సమర్పించారు. పబ్ తరపు లాయర్ ఈ ఘటనలో ఒక్క స్టాఫర్ కూడా ఇన్వాల్వ్ కాలేదని వాదించారు.

దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆమెకు మెడికల్ ఖర్చుల కోసం అయిన రూ.74వేలు చెల్లించాలని వాటితో పాటు లిటిగేషన్ కోసం పెట్టిన ఖర్చును కూడా ఇచ్చేయాలని చెప్పింది.