26 గంటల తర్వాత…శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడ్డ మహిళ

  • Published By: venkaiahnaidu ,Published On : August 26, 2020 / 03:38 PM IST
26 గంటల తర్వాత…శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడ్డ మహిళ

Updated On : August 26, 2020 / 4:02 PM IST

మహారాష్ట్రలోని భవనం కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 26 గంటల తర్వాత ఓ మహిళ శిథిలాల నుంచి క్షేమంగా బయటపడింది. ఓ మహిళ 26 గంటలపాటు శిథిలాల కింద బిక్కుబిక్కుమంటూ గడిపింది.



ఒక రోజు గడిచిపోవడం వల్ల మిగతావారు ఎవరూ బతికి ఉండరేమో అని భావిస్తున్న సమయంలో మేరున్నీస అబ్దుల్‌ హమీద్‌‌ కాజీ ప్రాణాలతో బయటపడటంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. మంగళవారం ఆమెను సురక్షితంగా బయటకు తీసిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రికి తరలించారు. ఇదే ఘటనలో ఓ నాలుగేళ్ల బాలుడు 18 గంటల తర్వాత క్షేమంగా బయటపడ్డాడు.
https://10tv.in/new-giudelines-for-online-classes-by-telangana-govt/
రాయ్‌గఢ్‌ జిల్లా కాజల్‌పురా ప్రాంతం మహద్‌ పట్టణంలో సోమవారం సాయంత్రం ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. దాదాపు 90 మందికిపైగా భవన శిథిలాల కింద చిక్కుకుపోగా ఇప్పటివరకు 61 మందిని సహాయక బృందాలు కాపాడాయి. 16 మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పలువురిపై కేసులు నమోదు చేశారు.