రైలు టాయ్ లెట్ లో కాలు ఇరుక్కుపోయింది.. అలాగే ఆస్పత్రికి..
రైల్లో ప్రయాణిస్తున్న ఓ మహిళ కాలు ప్రమాదవశాత్తూ టాయిలెట్ లో ఇరికింది. హైదరాబాద్-చార్మినర్ ఎక్స్ ప్రెస్ లో ఈ ఘటన మంగళవారం సాయంత్రం (జనవరి 30, 2019) జరిగింది.

రైల్లో ప్రయాణిస్తున్న ఓ మహిళ కాలు ప్రమాదవశాత్తూ టాయిలెట్ లో ఇరికింది. హైదరాబాద్-చార్మినర్ ఎక్స్ ప్రెస్ లో ఈ ఘటన మంగళవారం సాయంత్రం (జనవరి 30, 2019) జరిగింది.
రైల్లో ప్రయాణిస్తున్న ఓ మహిళ కాలు ప్రమాదవశాత్తూ టాయిలెట్ లో ఇరికింది. హైదరాబాద్-చార్మినర్ ఎక్స్ ప్రెస్ లో ఈ ఘటన మంగళవారం సాయంత్రం (జనవరి 30, 2019) జరిగింది. అప్రమత్తమైన రైల్వే అధికారులు, వైద్యులు అక్కడికి చేరుకొని శ్రమించి టాయిలెట్ లో స్టీల్ రేకును కట్ చేసి ఇరికిన మహిళ కాలును బయటకు తీశారు. అరగంటకుపైగా నరకయాతన పాడిన బాధిత మహిళ చివరికి ఊపిరి పీల్చుకుంది.
ఎలా జరిగిందంటే.. ఆంధ్రప్రదేశ్ కు చెందిన 40 ఏళ్ల భారతమ్మ అనే మహిళ హైదరాబాద్-చార్మినర్ ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కింది. షెడ్యూల్ ప్రకారం.. సాయంత్రం 6.10 గంటలకు బయల్దేరాల్సి ఉంది. ఇంతలో ట్రైన్ టాయిలెట్ రూంలోకి వెళ్లింది. ప్రమాదవశాత్తూ మహిళ కాలు టాయిలెట్ రంధ్రంలో ఇరికింది. దీంతో మహిళ లబోదిబోమంటూ సాయం కోసం పెద్దగా కేకలు పెట్టింది. ప్రయాణికులు సమాచారం మేరకు రైల్వే అధికారులు అక్కడికి చేరుకొన్నారు.
టాయిలెట్ స్టీల్ రేకు కట్ చేసి చివరికి మహిళ కాలును బయటకు తీశారు. స్వల్పగాయాలైన మహిళను అపోలో ఎమర్జెన్సీ కేర్ సెంటర్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన కారణంగా చార్మినర్ ఎక్స్ ప్రెస్ 36 నిమిషాలు ఆలస్యంగా బయల్దేరినట్టు రైల్వే పోలీసులు తెలిపారు.