PM Modi : దేశానికి వస్తున్న ప్రశంసలకు కారణం నేను కాదు..ప్రజలతో సన్నిహితంగా ఉండండి
దేశంలో కరోనా ప్రబలిన తర్వాత తొలిసారిగా ఇవాళ భారతీయ జనతా పార్టీ..ఢిల్లీలో నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోదీ భావోద్వేగ ప్రసంగం చేశారు. ప్రపంచమంతా

Pm Modi (1)
PM Modi: దేశంలో కరోనా ప్రబలిన తర్వాత తొలిసారిగా ఇవాళ భారతీయ జనతా పార్టీ..ఢిల్లీలో నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోదీ భావోద్వేగ ప్రసంగం చేశారు. ప్రపంచమంతా భారత్ ను చూసి ప్రశంసిస్తోంది తన వల్ల కాదని..బీజేపీ కార్యకర్తలపై దేశ ప్రజలు పెట్టుకున్న నమ్మకమే ఈ ప్రశంసలకు కారణమని మోదీ తెలిపారు.
బీజేపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సేవా హీ సంఘటన్ కార్యక్రమం గురించి ప్రస్తావించిన మోదీ..సమాజానికి పార్టీ కార్యకర్తలు చేసిన సేవను కొనియాడారు. సేవ అనేది దైవం యొక్క అత్యున్నత రూపమన్నారు. బీజేపీ కార్యకర్తలు సరికొత్త సేవా సంస్కృతిని తీసుకొచ్చారన్నారు. దేశం కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో సేవా హీ సంఘటన్ ద్వారా చేసిన సేవలు అసమాన్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, సీఎంలు మాట్లాడుతుంటే… వారిలో ఓ విశ్వాసం కనిపించిందన్నారు. గత ఐదేళ్లలో చేసిన పని నుంచి వచ్చిన సంతృప్తితోనే వారు ఇంత విశ్వాసంతో ఉన్నారన్నారు.
ప్రజలకు చేరువైన సమస్యలను తీసుకుంటూ ముందుకు సాగుతున్నందున ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల్లో బీజేపీ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ ఏ కుటుంబం చుట్టూ కేంద్రీకృతమై లేదని..బీజేపీ విలువలు- ‘సేవ, సంకల్ప్, సమర్పన్ అని మోదీ అన్నారు.
ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు మోదీ కీలక సూచనలు చేశారు. ప్రజలతో సన్నిహితంగా ఉండాలని..తెలిసిన వ్యక్తులతో అనుబంధాన్ని కలిగి ఉండాలని బీజేపీ కార్యకర్తలకు మోదీ పిలుపునిచ్చారు. తొలి నుంచీ పార్టీతో ఉన్న కార్యకర్తలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ ఈ కార్యకర్తలు పార్టీని వీడినా కూడా..పార్టీ ఎదుగుదల కోసం వారు చేసిన కృషిని ప్రస్తావించాల్సిందేనన్నారు.
ALSO READ JP Nadda : బీజేపీ శక్తిని ఇంకా పూర్తిస్థాయిలో చూడలేదు