World Rhino Day : 2,479 ఖడ్గమృగం కొమ్ములను తగులబెట్టిన అస్సాం సర్కార్
సెప్టెంబర్ 22 న ప్రపంచ ఖడ్గమృగ దినోత్సవం (World Rhino Day). సందర్భంగా అస్సాం ప్రభుత్వం వేలాది ఖడ్గమృగం కొమ్ములను దగ్థం చేసింది.

Assam Govt Burned 2479 Horns
World Rhino Day 2021 : సెప్టెంబర్ 22 న ప్రపంచ ఖడ్గమృగ దినోత్సవం (World Rhino Day). ఈ సందర్భంగా అస్సాం ప్రభుత్వం వేలాది ఖడ్గమృగం కొమ్ములను దగ్థం చేసింది. భారీ ఆకారంలో ఉండే రైనో కొమ్ములకు బాగా గిరాకీ ఉండటంతో వీటి మనుగడకే ప్రమాదంగా మారింది.వీటి కొమ్ములకు ఆశపడి ఎంతోమంది వేటగాళ్లు వీటిని అత్యంత దారుణంగా వేటాడుతున్నారు. దీంతో రైనోల మనుగడ ప్రశ్నర్ధకంగా మారుతోంది. క్రూర మృగాల నుంచి వీటిని కాపాడే ఆ కొమ్మే వాటికి ప్రాణసంకటంగా మారింది. ఆ కొమ్ముల కోసం ఖడ్గ మృగాలు వేటకు బలవుతున్నాయి.
Read more : హార్ట్ టచ్చింగ్ వీడియో : మేకతో ఖడ్గమృగం ఆటలు
కాగా.. రైనోల కొమ్ములను పోగుచేసి ఈ అంతర్జాతీయ రైనో దినోత్సవంగా గోళాఘాట్‌లో ఒకేసారి రైనో కొమ్ములను ప్రభుత్వం తగులబెట్టింది. ప్రభుత్వం ఎందుకలా చేసిందంటే..రైనోలను సంరక్షించుకుకోవటానికి ప్రభుత్వం ఇలా చేయాల్సి వచ్చింది. రైనోలను కాపాడుకోవాలనే మంచి సంకల్పంతో వేలాది కొమ్ములను తగులబెట్టించింది.
రైనోల కొమ్ములు పలు రకాల ఔషధాల్లో వాడుతారనే కారణంతో వేటగాళ్లు అటవీ అధికారుల కళ్లుగప్పి రైనోలను వేటాడుతున్నారు. అత్యంత కిరాతకంగా వాటిని చంపి, కొమ్ములు కోసుకుని పారిపోతున్నారు. ఈ క్రమంలో రైనో కొమ్ములకు ఎలాంటి ఔషధ ప్రాముఖ్యత లేదని వేటగాళ్లకు బలమైన సందేశం ఇవ్వడం కోసం అసోం సర్కారు ఇలా చేసింది.
Read more : అసోంలో వరదలు : రోడ్డు మీదకు వచ్చి పడుకున్న ఖడ్గమృగం
కాగా..ఏ ప్రత్యేక రోజు అయినా..దానికి సంబంధించి అవగాహన కల్పించటం..వాటిని కాపాడుకోవటం వంటి అంశాలపై జరుగుతుంది. అలాగే ఈ రైనోల విషయంలో కూడా అంతే. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 22న ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.