Uber Fare: క్యాబ్‌లో ఇంత తక్కువ దూరానికి అంత బిల్లా? షాక్ అయిన ప్రయాణికుడు

చివరకు బస్సులో తన ప్రాంతానికి వెళ్లానని చెప్పాడు.

Uber Fare: క్యాబ్‌లో ఇంత తక్కువ దూరానికి అంత బిల్లా? షాక్ అయిన ప్రయాణికుడు

Uber

బెంగళూరులో ట్రాఫిక్ జామ్ ఎంతగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయామంటే అదో పీడకలగా మిగిలిపోతుంది. ఇక ప్రజా రవాణా వాహనాలను వాడితే మన సమయం అంతా వృథా అయిపోతుంది.

దీంతో చాలా మంది ప్రైవేట్ క్యాబ్‌లను బుక్ చేసుకుని వెళ్తుంటారు. ఆ క్యాబ్‌లకు అలవాటు పడి ట్రాఫిక్ రద్దీ ఉండని సమయంలోనూ వాటినే బుక్ చేసుకుంటుంటారు. క్యాబ్‌లు ఎక్కేవారికి ఒక్కోసారి ఊహించని విధంగా కష్టాలు ఎదురవుతుంటాయి.

తాజాగా, రాజేశ్ భట్టాడ్ అనే ఓ వ్యక్తి కెంపెగౌడ విమానాశ్రయం నుంచి బెంగళూరు శివారులోని ఓ ప్రాంతానికి వెళ్లడానికి ఉబర్ క్యాబ్ ఎక్కాలనుకున్నాడు. అయితే, అర్ధరాత్రి దాటాక అతి తక్కువ దూరానికి ఉబర్ క్యాబ్ విధిస్తున్న చార్జీలు చూసి షాక్ అయ్యాడు.

ఎయిర్‌పోర్టు నుంచి హెచ్ఎస్ఆర్‌కు రూ.1,931 బిల్లు అవుతుందని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. బిల్లుల జాబితాలకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశాడు. చివరకు బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ సూచన మేరకు అతి తక్కువ టికెట్ బిల్లుతో బస్సులో తన ప్రాంతానికి వెళ్లానని చెప్పాడు.

Read Also : అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌‍లో దేశవిదేశాల ప్రముఖుల సందడి..